Snigdha Counter to Music Director Manisharma: నటిగా పలు సినిమాల్లో కనిపించడమే కాదు కొన్ని పాటలు కూడా పాడిన స్నిగ్ధ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అవ్వడానికి అమ్మాయి అయినా ఆమె కనిపించడానికి మాత్రం అబ్బాయిలా కనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఆమె అబ్బాయి అని పొర బడుతూ ఉంటారు కూడా. తాజాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్ లో రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్న దావత్ అనే ప్రోగ్రామ్కి స్నిగ్ధ గెస్ట్ గా హాజరైంది. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె అనేక విషయాలు పంచుకుంది.
Deepthi Sunaina: షన్నుతో బ్రేకప్.. నటుడు విశాల్‌తో ప్రేమలో దీప్తి సునైనా.. ?
ఈ సందర్భంగా రీతూ చౌదరి ఇటీవల మణిశర్మ చేసిన వ్యాఖ్యల గురించి శ్రద్ధ దృష్టికి తీసుకు వచ్చింది. మణిశర్మ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్ని సినిమాలు కొందరు మ్యూజిక్ డైరెక్టర్లకి ఇవ్వడం కంటే ఒక సినిమా నాకు, ఒక సినిమా దేవి శ్రీ ప్రసాద్ కి మరో సినిమా ఎస్ఎస్ తమన్ కి ఇస్తే బాగుంటుంది కదా అని అన్నారు. దానిపై మీ అభిప్రాయం ఏమిటి అని రీతు చౌదరి ప్రశ్నించింది. దానికి స్నిగ్ధ స్పందిస్తూ ఎవరి స్ట్రెంత్ వాళ్లది ఒకళ్ళు ఇచ్చిన సాంగ్ కి ఒక ట్యూన్ నచ్చి ఉండొచ్చు, మరొకరు ఇచ్చిన సాంగ్ కి మరొకటి నచ్చి ఉండవచ్చు. కాకపోతే ఆ సాంగ్స్ బయటికి రావడం వల్ల వాళ్లు షోలకి గట్టిగా తీసుకుంటారు. అలాగే ఆ మ్యూజిక్ డైరెక్టర్ తో డైరెక్టర్ ఎక్కువగా ట్రావెల్ చేస్తే వాళ్లని తీసుకుంటారేమో ఎప్పుడూ మనమే ఉండాలనుకుంటే ఎలాగా? అంటూ ఆమె కౌంటర్ ఇచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది