Skanda: సాధారణంగా కొన్ని సినిమాలు.. థియేటర్ లో ప్లాప్ టాక్ ను తెచ్చుకుంటాయి. కానీ, అవే సినిమాలు ఓటిటీలోనో, టీవీ లోనో వస్తే భారీ రెస్పాన్స్ అందుకుంటాయి. ప్రేక్షకులు కూడా మొదటిరోజు.. మొదటిషోకు వెళ్లి కొద్దిగా నచ్చకపోయినా సినిమా ప్లాప్ అని చెప్పేస్తారు. అదే ప్రేక్షకులు టీవీ లో వస్తే.. ఛానెల్ తిప్పకుండా చూస్తారు. దీనికి కారణాలు చాలానే ఉన్నా కూడా .. చివరికి సినిమాను ప్రేక్షకులు చూడకుండా ఉండలేరు అని నిరూపిస్తారు. ఇలా ఎన్నో సినిమాలు అండరేటెడ్ అని, అప్పుడు సినిమా ఎక్కలేదు కానీ, టీవీలో చూస్తే బావుందని చెప్పుకొస్తారు. ప్రస్తుతం స్కంద సినిమా ఇలాంటి కామెంట్స్ నే అందుకుంటుంది. రామ్, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా స్కంద.
గతేడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది. రికార్డ్ కలక్షన్స్ రాబట్టకపోయినా ఓ మోస్తరు కలక్షన్స్ రాబట్టింది. కానీ, సినిమాలో పాత్రలు మలిచిన తీరు, అర్ధం కానీ కథనంతో ప్రేక్షకులకు నచ్చలేదని తీర్పు ఇచ్చారు. ఇక ఓటిటీకి వచ్చాకా కూడా ఈ సినిమా ట్రోలింగ్ కు గురి అయ్యింది. ఇప్పుడు స్కంద టీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆదివారం కావడంతో.. సండే స్పెషల్ గా మా టీవీ లో స్కంద స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇక్కడ స్కంద రికార్డ్ బ్రేక్ చేసింది. ప్రతి ఒక్కరు స్కంద సినిమానే వీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అత్యధిక టీఆర్పీ రాబడుతుంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మా ఇంట్లో స్కంద చూస్తున్నారు.. మా ఇంట్లో కూడా అదే చూస్తున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరికొందరు మాత్రం థియేటర్ లో ప్లాప్ చేసి.. ఇప్పుడు దేనికిరా ట్రెండ్ చేస్తున్నారు..అంటూ చెప్పుకొస్తున్నారు.