Site icon NTV Telugu

SJ Suryah: అబ్బాయికి విలన్ గా మారిన బాబాయ్ డైరెక్టర్

shankar

shankar

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.  దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా ఇటీవలే రాజమండ్రి లో షూటింగ్ జరుపుకొంటుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో అంజలి – జయరామ్ – సునిల్ – శ్రీకాంత్ – నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక తాజగా ఈ సినిమా కోసం స్టార్ డైరెక్టర్ ని రంగంలోకి దింపుతున్నాడట శంకర్.. అతనెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్.. నటుడు ఎస్ జె సూర్య.

పవన్ కళ్యాణ్ తో ఖుషి, కొమరం పులి చిత్రాలను తెరకెక్కించి మెప్పించిన ఎస్ జె సూర్య ప్రస్తుతం నటనపై ఫోకస్ పెడుతున్న సంగతి తెల్సిందే. ఇక ఇటీవల మానాడు చిత్రంలో సూర్య చూపించిన విలనిజంకి ఫ్యాన్స్ ఫిదా అయినా విషయం విదితమే. ఇక ఈ సినిమాలో కూడా పవర్ ఫుల్ విలన్ పాత్ర ఉండడంతో.. ఆ పాత్రకు సూర్య ఒక్కడే న్యాయం చేయగలడని శంకర్ భావిస్తున్నాడట. అన్ని కుదిరితే త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారట. మరి ఈ వార్తలో నిజమెంత ఉందొ తెలియాలంటే మేకర్స్ నోరు విప్పాల్సిందే

Exit mobile version