తెలుగు ప్రేక్షకుల వినోదానికి ఎన్నో కార్యక్రమాలు , మరెన్నో సీరియల్స్ ను మనకు అందించిన జెమినీ టీవీ.. ఇప్పుడు “సివంగి”.. అనే సరికొత్త సీరియల్ ను మార్చి 25 నుండి ప్రసారం చేయబోతోంది. ఒక పల్లెటూరిలో పేద కుటుంబంలో పుట్టి, ఊరిలోని ఆడవాళ్ళ డ్రెస్సులు కుడుతూ అమ్మానాన్నలకు ఆర్ధికంగా సహాయపడుతూ , స్నేహితులతో సరదాగా జీవితాన్ని గడిపే అమ్మాయి ఆనంది. వూళ్ళో ఎవరికీ ఏ కష్టం వచ్చినా, సొంత మనిషిలా వెళ్లి సహాయపడుతుంది. అక్క పెళ్ళిలో ఏర్పడిన అనుకోని పరిస్థితుల వల్ల ఒక కొడుకులా ఇంటి బాధ్యతలను భుజాన వేసుకుని , అవి నెరవేర్చడానికి సిటీకి ప్రయాణమవుతుంది. సిటీకి వెళ్లిన ఆనంది ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి ? తన అక్క పెళ్లి చేయగలిగిందా ? తిరిగి తన వూరు వెళ్లగలిగిందా ? అనేది తెలియాలి అంటే జెమిని టివిలో ఈ నెల 25న ప్రారంభం అయి సాయంత్రం 7.30 గంటలకు ప్రసారమయ్యే సివంగి సీరియల్ చూడాల్సిందే. “సివంగి”. సీరియల్లో ప్రతిమ, రేణుక, నట కుమారి, చంద్ర శేఖర్, శ్రీ ప్రియ తదితర నటీనటులు నటించారు.