Site icon NTV Telugu

‘డాక్టర్ వరుణ్’ గా శివ కార్తికేయన్

Sivakarthikeyan's Doctor to release in theatres on Oct 9

తమిళ నటుడు శివకార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డాక్టర్’. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా అదే పేరుతో డబ్ చేసి విడుదల చేయనున్నారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 9న విడుదల కానుంది. కోటపాడి రాజేష్ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్, ఎస్.కె ప్రొడక్షన్స్ తో కలసి నిర్మించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు తమిళంలో ఇంతకు ముందే విడుదలయ్యాయి. తెలుగు పాటల్ని త్వరలో విడుదల చేయనున్నారు.

Read Also : “లైగర్”కు బాలయ్య సర్ప్రైజ్

‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా గురించి నిర్మాత కోటపాడి రాజేష్ వివరిస్తూ ‘డాక్టర్ మంచి మాస్ ఎంటర్టైనర్. విజయ్ తో ‘బీస్ట్‘ తీస్తున్న నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించారు. గతంలో శివకార్తికేయన్ ‘శక్తి’ సినిమా మాకు లాభాలు తెచ్చింది. అక్టోబర్ 9న రానున్న ‘డాక్టర్’ కూడా అందరినీ అలరిస్తుంది’ అంటున్నారు. డాక్టర్ వరుణ్ గా శివ కార్తికేయన్ నవరసాలు పండిచారని, పలు ఒడిదుడుకుల తరువాత అక్టోబర్ 9న విడుదల చేస్తున్నామంటున్నారు దర్శకులు నెల్సన్. యోగిబాబు, వినయ్, రాయ్, మిలింద్ సోమన్ ఇందులోని ఇతర పాత్రధారులు.

Exit mobile version