“లైగర్”కు బాలయ్య సర్ప్రైజ్

విజయ్ దేవరకొండ హీరోగా, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీంకు నందమూరి బాలకృష్ణ సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ “లైగర్” సెట్ ను సందర్శించారు. బాలయ్య అక్కడ కనిపించడంతో మేకర్స్ తో పాటు విజయ్ దేవరకొండ సైతం ఆశ్చర్యపోయారు. ఆ తరువాత అనుకోని అతిథిలా వచ్చిన ఆయనతో మాట్లాడి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అందులో బాలయ్యతో పాటు విజయ్ దేవరకొండ, పూరీ, ఛార్మి ఉన్నారు. గతంలో బాలకృష్ణతో పూరి ‘పైసా వసూల్’ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

Read Also : వర్మ అక్కడా ప్లాఫ్ అయ్యాడా!?

అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ‘లైగర్’కు పూరి, ఛార్మి, కరణ్‌ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు ఇతర ప్రధాన భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాగా, గోవాలో నైట్ ఎఫెక్ట్‌లో యాక్షన్ సన్నివేశాల కోసం భారీ సెట్‌ను ఏర్పాటు చేసి చిత్రీకరిస్తున్నారు. మరోవైపు బాలయ్య ఇటీవలే బోయపాటి దర్శకత్వంలో “అఖండ”ను పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో నటిస్తున్నారు.

-Advertisement-"లైగర్"కు బాలయ్య సర్ప్రైజ్

Related Articles

Latest Articles