Site icon NTV Telugu

Sitara Ghattamaneni: తండ్రికి అసలు సిసలైన ఫ్యాన్ అంటే.. నువ్వే సీతూ పాప

Sitara

Sitara

Sitara Ghattamaneni: సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుట్టినప్పటి నుంచే సితార చిన్నపాటి సెలబ్రిటీగా మారిపోయింది. ఇక పెరిగేకొద్దీ సీతూపాప కూడా తన టాలెంట్ కూడా పెరుగుతూ వస్తుంది. 11 ఏళ్లకే ఈ చిన్నది మోడల్ గా మారిపోయింది. ఇన్స్టాలో 1.8 మిలియన్స్ ఫాలోవర్స్ తో హీరోయిన్లను మించిపోయింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే నేడు.. జనవరి నెలలో సితార ఎలా గడిపింది అనేది ఒక వీడియో రూపంలో అభిమానులతో పంచుకుంది. అందులో అన్న గౌతమ్ తో మాట్లాడడం, తండ్రి సినిమా గుంటూరు కారం ను ఫ్రెండ్స్ తో చూడడం.. చూపించింది. నిన్న AMB మాల్ లో సితార గుంటూరు కారం వీక్షించింది. సితారతో పాటు వంశీ పైడిపల్లి కూతురు కూడా ఉంది. వీరిద్దరూ చిన్నప్పటినుంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెల్సిందే.

ఇకపోతే సీతూపాప గుంటూరు కారం సినిమా చూడడం విశేషం కాదు .. గుంటూరు కారంలో మహేష్ ధరించిన షర్ట్ వేసుకొని వెళ్లి మరీ సినిమా చూడడం విశేషం. సాధారణంగా హీరోల డై హార్ట్ ఫ్యాన్స్.. మొదటిరోజు సినిమా చూసేటప్పుడు హీరోలు ఆ సినిమాలో ఎలాంటి డ్రెస్ వేసుకున్నారో .. అదే డ్రెస్ వేసుకొని అలాగే రెడీ అయ్యి చూస్తారు. ఇప్పుడు సితార కూడా మహేష్ షర్ట్ వేసుకొని సినిమా చూడడం హాట్ టాపిక్ గా మారింది. తండ్రికి అసలు సిసలైన ఫ్యాన్ అంటే.. నువ్వే సీతూ పాప అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version