Sitara Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకపక్క సినిమాలు.. ఇంకోపక్క యాడ్స్ తో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ లోనే కాదు ఇండస్ట్రీ మొత్తంలో అత్యధిక యాడ్స్ చేసి .. ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గామారిన ఏకైక హీరో మహేష్ బాబు. ఇక యాడ్ చేసినా కూడా మహేష్ సినిమాకు తీసుకొనేంత రెమ్యూనిరేషన్ తీసుకుంటాడు. అది మహేష్ రేంజ్. ఇక తండ్రి దారిలోనే కూతురు కూడా నడుస్తోంది. మహేష్ ముద్దుల తనయ సితార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీతూ పాప పుట్టడం దగ్గరనుంచే ఆమె ఒక చిన్నపాటి సెలబ్రిటీ అయిపోయింది. ఇక 10 ఏళ్ళ వయస్సులోనే సితార సోషల్ మీడియా పేజీతో పాటు తనకంటూ ఓన్ గా ఒక యూట్యూబ్ ను కూడా స్టార్ట్ చేసింది. ఇక పెరుగుతున్న కొద్దీ సితారను అభిమానులకు దగ్గరచేస్తున్నాడు మహేష్. కూతురు ఫోటోషూట్స్, డ్యాన్స్ వీడియోలను తల్లి నమ్రత చూసుకొంటుంది.
Payal Rajput : ప్రభాస్ తో కలిసి ఆ సినిమా చూడాలని ఉంది..
ఇక మహేష్ సర్కారు వారి పాట సినిమా కోసం సీతూ పాప మొదటిసారి వెండితెరపై కనిపించింది. ప్రమోషన్ సాంగ్ లో మెరిసి మెప్పించింది. నిత్యం సోషల్ మీడియాలో తన డ్యాన్స్ వీడియోలతో అభిమానులను అలరిస్తున్న సితార.. తాజాగా ఒక జ్యూవెలరీ యాడ్ లో కనిపించింది. అందమే అసూయపడేలా సితార ఆ ఆభరణాల్లో నిజంగానే రాజకుమారిలా కనిపించింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం సితార మొదటి యాడ్ కే కళ్ళు చెదిరే రెమ్యూనిరేషన్ అందుకుందని టాక్. అవును ఈ యాడ్ కోసం సితార అక్షరాలా .. కోటి రూపాయలు అందుకుందట. దీంతో అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. మొదటి యాడ్ కే ఈ రేంజ్ లో అందుకుంటే.. ముందు ముందు ఈ చిన్నది.. తండ్రిని మించిపోతుందేమో అని కామెంట్స్ పెడుతున్నారు. మరి సితార.. రాబోయే రోజుల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందో లేదో చూడాలి.