సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేసిన మూడో సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల బాటలో నడుస్తూ గుంటూరు కారం సినిమాకి రిపీట్ వేల్యూ ఉంది కానీ థియేటర్స్ లో డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రీమియర్స్ సమయంలో అయితే గుంటూరు కారం సినిమా పనైపోయింది అనే మాటలు వినిపించాయి కానీ మొదటి రోజు ఆఫ్టర్ నూన్ షో నుంచి టాక్ మారడం మొదలయ్యింది. ఈవెనింగ్ షోస్ నుంచి ఫుల్ గా పుంజుకున్న గుంటూరు కారం సినిమా ఇప్పటివరకు 220 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయిన గుంటూరు కారం సినిమా మండే లోపు అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని చేరుకోనుంది. కాస్త స్లో అండ్ స్టడీగా సాగుతున్న గుంటూరు కారం సినిమా ఇదే పేస్ కంటిన్యూ చేస్తే చాలు టార్గెట్ బ్రేక్ అవ్వడానికి ఎక్కువ టైమ్ పట్టదు.
గుంటూరు కారం ఫైనల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి? ప్రొడ్యూసర్, మహేష్ బాబు ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకం ఎంతవరకు నిలబడుతుంది? బయ్యర్స్ సేఫ్ జోన్ లోకి వచ్చేస్తారా లేదా అనేది ఈ రెండు రోజులు కలెక్షన్స్ పైన డిపెండ్ అయ్యి ఉంది. 90% టార్గెట్ ని మహేష్ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తో కంప్లీట్ చేసాడు కాబట్టి ఇంకో 10%ని క్రాస్ చేయడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. తెలుగులో కూడా ఇప్పటికిప్పుడు రిలీజయ్యే పెద్ద సినిమాలేమీ లేవు కాబట్టి గుంటూరు కారం సినిమా ఇంకొన్ని రోజులు థియేటర్స్ లో ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమాని అనాథ పిల్లలకి స్పెషల్ షో వేసి చూపించింది సితార ఘట్టమనేని. ఏఎంబి మాల్ లో గుంటూరు కారం స్పెషల్ స్క్రీనింగ్ ని ఏర్పాటు చేసిన సితార ఘట్టమనేని, ఆర్ఫన్స్ తో కలిసి సినిమా చూసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.