దుల్కర్, మృణాల్ ఠాగూర్ తో హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించిన ‘సీతారామం’ ఆగస్ట్ 4న విడుదలై ఘన విజయం సాధించింది. అద్భుతమైన ప్రేమకథా దృశ్యకావ్యంగా ఇటు చిత్రపరిశ్రమలోనూ అటు ఆడియన్స్ లోనూ చక్కటి పేరు సంపాదించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా హిందీ వెర్షన్ ను సెప్టెంబర్ 2న రిలీజ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 75 కోట్ల గ్రాస్ ను వసూలు చేయటం విశేషం. కథపైన, దర్శకుడు హనురాఘవపూడిపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సినిమా ఘన విజయం సాధించటంపై నిర్మాత అశ్వనీదత్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ లోనూ ఈ సినిమా ఆడియన్స్ మెప్పుపొందుతుందని నమ్ముతున్నారు. మరి ఆయన నమ్మకం ఎంత వరకూ నిలబడుతుందో చూడాలి.
