Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ కేసులో సీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలను విచారించిన అధికారులు నేడు విజయ్ దేవరకొండతో పాటు సిరి హనుమంతును విచారించారు. ఇప్పటికే విజయ్ విచారణ పూర్తి కాగా.. తాజాగా సిరి విచారణ జరుగుతోంది. బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంతు నిషేధిత బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిందని కేసు నమోదైన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు పెద్ద ఎత్తున రెమ్యునరేషన్ ను సిరి హనుమంతు తీసుకుందనే వార్తలు వచ్చాయి.
Read Also : Tamannah : అలాంటి ఇంజెక్షన్లు వాడుతున్న తమన్నా..? అసలు నిజం ఇదే..!
బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన డబ్బుతో మూడు బ్యూటీ ట్రీట్ మెంట్ హాస్పిటల్స్ ను సిరి హనుమంతు నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గోవిందా 365 అనే బెట్టింగ్ యాప్ ను సిరి హనుమంతు ప్రమోట్ చేసింది. జీరో పర్సెంట్ టాక్స్.. అంటూ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసినట్లు CID ఆధారాలు సేకరించింది. సిరిని అధికారులు కీలక ప్రశ్నలు అడుగుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయగా వచ్చిన డబ్బులను ఏం చేశారు.. ఆ డబ్బును ఎలా తీసుకున్నారు, వాళ్లతో పరిచయం ఎలా అయింది, వాళ్ల వివరాల గురించి అడుగుతున్నట్టు సమాచారం.
Read Also : Betting Apps Case : సిట్ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ..
