Siren Teaser: కోలీవుడ్ స్టార్ హీరోల్లో జయం రవి ఒకరు. అతను తెలుగువారికి కూడా సుపరిచితమే. ఈ ఏడాది పొన్నియిన్ సెల్వన్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ఆ తరువాత గాడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భయపెట్టాడు. ఇక ఇప్పుడు సైరెన్ మోగించడానికి సిద్దమయ్యాడు. జయం రవి హీరోగా.. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సైరెన్ 108. సుజాత విజయ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో జయం రవి సరసన అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక కొద్దిరోజుల క్రితం ఈ సినిమా తమిళ్ టీజర్ ను రిలీజ్ చేయగా .. నేడు తెలుగు టీజర్ ను రిలీజ్ చేసారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఒక హత్య చేసి జైల్లో 14 ఏళ్లు శిక్ష అనుభవిస్తూ పెరోల్ మీద బయటికి వచ్చిన ఖైదీలా జయం రవి కనిపించాడు.
Aadikeshava: మమ్మల్ని క్షమించండి.. సరైన సమయానికి రిలీజ్ చేయలేకపోతున్నాం
” నీతో ఒకరి గురించి చెప్పాలి అని కీర్తి సురేష్ వాయిస్ తో మొదలైన టీజర్ .. జైల్లో జయం రవి తన గురించి తాను చెప్పుకుంటున్న డైలాగ్ తో కంటిన్యూ అయ్యింది. అంబులెన్స్ డ్రైవర్ గా ఎంతోమంది ప్రాణాలు కాపాడిన హీరో.. ఒక హత్య చేసి జైలుకు వెళ్తాడు. ఇక అక్కడినుంచి బయటకు వెళ్లే రోజు కోసం ఎంతో ఎదురుచూసిన అతనికి.. 14 ఏళ్ళ తరువాత పెరోల్ మీద బయటకు వచ్చే అవకాశం దొరుకుతుంది. మరి బయటకు వచ్చాకా అతను మళ్లీ ఏం చేశాడు.. ? ఎందుకు పోలీసులు.. హీరో చుట్టూనే తిరుగుతున్నారు. హీరో గతంలో ఏం జరిగింది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక సినిమాకు మంచి హైలైట్ ఏదైనా ఉంది అంటే .. అది జయం రవి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్. ఫ్లాష్ బ్యాక్ లో కుర్రాడిలా కనిపించినా. జైల్లో మాత్రం వైట్ హెయిర్ తో చాలా స్మార్ట్ గా కనిపించాడు. ఇక కీర్తి సురేష్ పోలీస్ గా కనిపించగా .. అనుపమ, జయం రవి భార్యగా కనిపించింది. ఇక జీవీ ప్రకాష్ సంగీతం ఆకట్టుకొనేలానే ఉంది. టీజర్ ను బట్టి ఇదేదో కొత్త కథలా అనిపిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో జయం రవి హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.
