NTV Telugu Site icon

Singer Mangli: ఆలీ, పోసాని తరువాత తెలంగాణ సింగర్ కు కీలక పదవి కట్టబెట్టిన జగన్..

Mangli

Mangli

Singer Mangli: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా ఆలీని, ఆ తరువాత ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణ మురళిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా మరో కీలక పదవిని సింగర్ మంగ్లీకి కట్టబెట్టారు జగన్. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డ్ అడ్వైజర్ గా ఆమెను నియమిస్తున్నట్లు ఆదేశాలను జారీ చేశారు.

సింగర్ మంగ్లీ అసలు పేరు సత్యవతీ. బోనాలు పాటలతో ఫేమస్ అయిన తెలంగాణ మహిళ మంగ్లీ. కొద్దిగా పేరు రావడంతో ఆమె సినిమాల్లో కూడా సింగర్ గా మారింది. ఇక మంగ్లీకి నెలకు లక్ష రూపాయలు జీతం ఇవ్వనున్నారు. రెండేళ్లు ఆమె ఈ పదవిలో కొనసాగనుంది. ఈ ఏడాది మార్చి నెలలోనే ఎస్‌వీబీసీ ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు రోజుల కిందట ఆమె బాధ్యతలు స్వీకరించారు.

Show comments