సాకేత్ హోస్ట్ గా ఎన్టీవీ ఎంటెర్టైన్మెంట్ లో Music ‘N’ Play అనే షో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ షోలో ఇప్పటికే ప్రముఖ సంగీత దర్శకులు, పాపులర్ సింగర్స్ పాల్గొని ఎంటర్టైన్ చేస్తున్నారు. పేరుకు తగ్గట్టుగానే ట్యాలెంటెడ్ మ్యూజిక్ స్టార్స్ తో కొనసాగుతున్న ఈ షో ఆసక్తికరంగా సాగుతోంది. Music ‘N’ Play తాజా ఎపిసోడ్ లో సింగర్స్ దీపు, కృష్ణ చైతన్య పాల్గొన్నారు. అయితే ఓ సందర్భంలో కృష్ణ చైతన్య ‘పంచదార బొమ్మా’ సాంగ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. హోస్ట్ సాకేత్ “ఇప్పటిదాకా వచ్చిన ఇన్ని వేల పాటల్లో వాళ్ళకంటే నేను బెటర్ గా పాడేవాడిని అని అన్పించిన సాంగ్ ఏంటి?” అని అడిగారు. దానికి వెంటనే కృష్ణ చైతన్య “పంచదార బొమ్మా’ సాంగ్ అని చెప్పేశాడు. ‘మగధీర’ సినిమాలో ఈ సాంగ్ ను అనూజ్ గుర్వార పాడారు.
Read Also : Bheemla Nayak : బావ సినిమాకి వచ్చా… పూనమ్ స్క్రీన్ షాట్ వైరల్