NTV Telugu Site icon

Telusu Kada: మంచి స్పీడుమీదున్నాం.. తెలుసు కదా!!

Telusu Kada Shoot

Telusu Kada Shoot

Siddu Jonnalagadda Telusu Kada First Schedule In Hyderabad Wrapped Up: చేసింది కొన్ని సినిమాలే అయినా తనదైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన అప్ కమింగ్ మూవీ ‘తెలుసు కదా’ లో కంప్లీట్ న్యూ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు. ప్రముఖ స్టైలిష్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్ గా డెబ్యు చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో పూర్తయింది. నెక్స్ట్ ఒక లెన్తీ షెడ్యూల్ కోసం సినిమా యూనిట్ సిద్ధమవుతోంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి, ఇప్పటికే 50% షూటింగ్ పూర్తి కాగా అవుట్‌పుట్‌తో టీమ్‌ కూడా చాలా హ్యాపీగా ఉంది.

Jr NTR Fan: క్యాన్సర్ తో అంపశయ్యపై అభిమాని.. దేవర వీడియో కాల్

నెల రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌లో సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్షలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలోని మొదటి పాటను కూడా సిద్దు జొన్నలగడ్డ, రాశీఖన్నాలపై చిత్రీకరించారు. ఇక షూట్ షెడ్యూల్ పూర్తయిన క్రమంలో రిలీజ్ చేసిన వర్కింగ్ స్టిల్స్ సెట్స్‌లో ప్లజెంట్ ఎట్మాస్స్పియర్ ని ప్రజెంట్ చేస్తున్నాయి. హై బడ్జెట్‌తో, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని టీం చెబుతోంది. జ్ఞాన శేఖర్ బాబా డీవోపీ కాగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొఫెషనల్ నవీన్ నూలి ఎడిటింగ్ హ్యాండిల్ చేస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, శీతల్ శర్మ కాస్ట్యూమ్ డిజైనర్. ఇక ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Show comments