తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘బాయ్స్’ మూవీతో హీరోగా పరిచయమైన సిద్దార్థ్.. ‘నువ్వోస్తానంటే నెనోద్దంటానా’ తెలుగు ఫస్ట్ స్ట్రైట్ మూవీతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారాడు. ‘బొమ్మరిల్లు’ అల్టిమేట్ హిట్ తో తిరుగులేని లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకుని వరుసపెట్టి సినిమాలతో జోరు చూపాడు. తెలుగులో 2013లో ‘జబర్దస్త్’ సినిమా చేసిన సిద్దార్థ్ ఆ సినిమా ఫ్లాఫ్ తర్వాత తెలుగుకి దూరం అయ్యాడు. ఇన్నేళ్ల తరువాత ఆర్‌ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి మల్టీస్టారర్ మూవీగా వస్తున్న ‘మహాసముద్రం’ చిత్రంలో సిద్దార్థ్ శర్వానంద్‌తో కలిసి నటిస్తున్నాడు. అను ఇమ్మాన్యుయేల్, ఆదితి రావు హైదరిలు కథానాయికలుగా నట్తిసున్నారు. ఇదిలాఉండగా, ఈ మూవీలో సిద్దార్థ్ రెమ్యూనరేషన్ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమాకి సిద్ధార్థ్ 3 కోట్ల రూపాయల పారితోషికంగా తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కుర్ర హీరోలలో ఎవరికి ఇంతటి పారితోషికం లేదని, తొమ్మిదేళ్ల తర్వాత కూడా సిద్దార్థ్ ఈ స్థాయిలో పారితోషికం తీసుకోవడంతో కొంత మంది షాక్ అవుతున్నారు. ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంత రెమ్యునరేషన్ దక్కడం విశేషం అనే చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్ తిరిగి తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.