Siddharth : హీరో సిద్దార్థకు తమిళంతో పాటు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. తెలుగులోనూ తన సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ ‘3 బీహెచ్‌కే’ శ్రీ గణేశ్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా మూవీ ట్రైలర్ ను చెన్నైలో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శరత్ కుమార్, దేవయాణి, యోగిబాబు లాంటి వారు మెయిన్ రోల్స్ చేస్తూ అలరించబోతున్నారు. తాజాగా మూవీ గురించి సిద్ధార్త మాట్లాడారు. ఇది నా 40వ సినిమా. ఇందులో నా తల్లిదండ్రులు కూడా నటించారు.
Read Also : Manchu Family : మంచు ఫ్యామిలీకి కలిసొచ్చిన ఏడాది..!
ఈ మూవీ విషయంలో నా పేరెంట్స్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించా. ఇది 40వ సినిమా అని నా తండ్రి సూర్య నారాయణన్ కు చెప్పాను. ఆయన చాలా గర్వపడ్డారు. ఆయన ముఖంలో చెప్పలేనంత ఆనందం, సంతోషం కనిపించాయి. అంతకంటే నాకు ఇంకేం కావాలి అనిపించింది. ’’ అంటూ కంటతడి పెట్టుకున్నారు సిద్దార్థ్.
ఈ సినిమా కోసం నా పేరెంట్స్ వాళ్ల డబ్బును ఖర్చు పెట్టారు. మూవీలో నటించిన వారంతా అద్భుతంగా చేశారు. ప్రస్తుతం నా సిచ్యువేషన్ బాగా లేదు. అందుకే అద్దె ఇంట్లో ఉంటున్నా. ఈ సినిమాను చూస్తే నా కుటుంబ పరిస్థితులు నాకు గుర్తుకు వస్తున్నాయి. ఈ మూవీ జులై 4న రిలీజ్ కాబోతోంది. అందరికీ నచ్చుతుంది’ అంటూ చెప్పాడు సిద్దార్థ్.
Read Also : Manchu Manoj : మా అన్న అదరగొట్టాడు.. ప్రభాస్ వచ్చాక వేరే లెవల్..
