Manchu Family : అవును.. మంచు ఫ్యామిలీకి ఈ ఏడు బాగా కలిసొచ్చింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వీరు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ తో వచ్చారు. మనోజ్, విష్ణు మంచి హిట్లు అందుకున్నారు. మనోజ్ సినిమాలు చేయక ఏడేళ్లు అవుతోంది. ఇక హిట్ కొట్టి ఎన్నేళ్లు అవుతుందో తెలియదు. అప్పుడెప్పుడో వచ్చిన శౌర్య సినిమాతో ఓ మోస్తరు హిట్ అందుకున్నారు. దాని తర్వాత అన్నీ ప్లాపులే. చివరిగా 2018లో ఆపరేషన్ 2019 సినిమాలో మెరిశాడు. దాని తర్వాత మళ్లీ ఇంకో సినిమా చేయలేదు.
read also : Manchu Manoj : మా అన్న అదరగొట్టాడు.. ప్రభాస్ వచ్చాక వేరే లెవల్..
ఏడేళ్ల తర్వాత మొన్న భైరవం సినిమాతో మే 30న వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇందులో మనోజ్ మెయిన్ లీడ్ కాకపోయినా.. ఆయన పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. ఎన్నో ఏళ్ల తర్వాత హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు మంచు విష్ణు, మోహన్ బాబులు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాలతో వచ్చిన కన్నప్ప నేడు థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. విష్ణుకు కచ్చితంగా హిట్ పడాలి అన్న టైమ్ లో వచ్చి బ్లాక్ బస్టర్ ఇచ్చింది కన్నప్ప.
మంచు విష్ణు చివరి సారిగా 2016లో వచ్చిన ఈడో రకం, ఆడోరకం మూవీతో హిట్ అందుకున్నాడు. దాని తర్వాత మళ్లీ హిట్ పడలేదు. వరుసగా సినిమాలు చేస్తున్నా హిట్ అనేది కరువైంది. 2022లో చివరగా వచ్చిన జిన్నా మూవీ ప్లాప్ అయింది. దాని తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుని చేసిన కన్నప్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఇందులో మోహన్ బాబు కీలక పాత్రలో మెరిశారు. ఆయన ఈ సినిమాను వెనకుండి నడిపించారు. అన్నీ తానై చూసుకున్నారు. ఈ సినిమాతో మోహన్ బాబుకు, విష్ణుకు సాలీడ్ హిట్ పడ్డట్టే. ఎన్నో ఏళ్ల తర్వాత వీరిద్దరు బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మొత్తంగా అన్న, దమ్ములు ఒకే ఏడాది పెద్ద హిట్లు వాళ్ల ఖాతాలో వేసుకున్నారు. ఈ ఏడాది మంచు ఫ్యామిలీకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
read also : Haryana: హర్యానాలో దారుణం.. కోడలిపై మామ హత్యాచారం.. ఇంటి ముందే..!