Site icon NTV Telugu

‘లైగర్’ భామ ఫోటోషూట్.. చలికి తట్టుకోలేక అందరు చూస్తుండగానే ఆ పని చేసి

ananya

ananya

బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. టాలీవుడ్ లో లైగర్ సినిమాతో అడుగుపెడుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ‘గెహ్రయాన్’ ప్రమోషన్స్ లో బిజీగా మారింది. శకున్ బాత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 11 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. దీపికా పదుకొనే, సిద్ధాంత్ చతుర్వేది, ధైర్య కర్వా ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ వేగవంతం చేశారు. తాజాగా అనన్య ఈ ప్రమోషన్స్ లో పాల్గొంది. ఇంటర్వ్యూ అయిపోయాక ఫోటోషూట్ చేయడం మొదలుపెట్టింది.

క్రీమ్ కలర్ జీన్స్ పై.. మెరూన్ కలర్ టాప్ తో పోజులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఆ టాప్ కొద్దిగా చిన్నగా ఉండడంతో ఏమండీ దేహ సౌందర్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక అదే సమయంలో చలిగాలులు వీస్తుండడం.. ఒంటిపై బ్లేజర్ కూడా లేకపోవడంతో అమ్మడు చలికి వణికిపోయింది. ఇక ఇది గమనించిన హీరో సిద్ధాంత్ చతుర్వేది వెంటనే తన బ్లేజర్ ని తీసి తనకు వేశాడు. వెంటనే అనన్య ఆ బ్లేజర్ ని ధరించి మళ్లీ ఫోటోషూట్ ని కంటిన్యూ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సిద్ధాంత్ చతుర్వేది చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సూపర్, కేరింగ్ హీరో, జెంటిల్ మ్యాన్ పనులు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Exit mobile version