నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ మూవీ “శ్యామ్ సింగ రాయ్” ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా భారీగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదలకు మరో నాల్రోజులు మాత్రమే ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ అధికారుల నుండి చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది. “శ్యామ్ సింగ రాయ్” రన్ టైమ్ 157 నిమిషాలని సమాచారం. అంటే సినిమా 2 గంటల 37 నిమిషాలు ఉంటుందన్నమాట.
Read Also : ఇది కదా మనకి కావాల్సిన మాస్… బాలయ్యతో రవితేజ !
రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో టైం ట్రావెల్ పీరియాడిక్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో నాని ఫిల్మ్ మేకర్, రచయితగా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. కోల్కత్తా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి దేవదాసీగా, కృతి శెట్టి మోడ్రన్ అమ్మాయిగా కనిపించబోతున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ ను ప్రేక్షకులు ఇప్పటికే ఎంజాయ్ చేశారు. సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలకు మంచి స్పందన లభించింది. దాదాపు రెండేళ్ల తరువాత వెండితెరపైకి వస్తున్న నాని చాలా ఎగ్జైటింగ్ గా, సినిమా విజయవంతం అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు. మరి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది డిసెంబర్ 24న తెలియనుంది.
ALL SET ♥️#SSRonDEC24th pic.twitter.com/emjhOzJXOo
— Nani (@NameisNani) December 19, 2021