రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో సాయి పల్లవి, నాని జంటగా నటించిన “శ్యామ్ సింగరాయ్” చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష స్పందన లభించింది. సినిమాలో నాని అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్, ద్విపాత్రాభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ‘శ్యామ్ సింగ్ రాయ్’లో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించగా… ఇద్దరి పాత్రలూ ప్రత్యేకమే. మోడ్రన్ అమ్మాయిగా కృతి, దేవదాసీగా సాయి పల్లవి ఆకట్టుకున్నారు. ఇది పాక్షికంగా 1970లలో కోల్‌కతా నేపథ్యంలో పునర్జన్మ నేపథ్యంలో జరిగే కథ. తాజాగా చిత్ర నిర్మాతలు ఓ డిలీటెడ్ సీన్ ను విడుదల చేయగా అది వైరల్‌గా మారింది. తొలగించిన సీన్‌లో ఒక వేశ్య నానిని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. దానికి ‘శ్యామ్ సింగ రాయ్’ ఇచ్చిన సమాధానం చూసి తీరాల్సిందే. “ఖచ్చితంగా చేసుకుంటా…నేను నిన్ను నిజంగా ప్రేమించిన రోజు” అంటూ శ్యామ్ సింగ రాయ్ బదులిచ్చారు.
Read Also : లీక్ : ఎట్టకేలకు వామిక ఫస్ట్ పిక్ అవుట్… ఫ్యాన్స్ ఫైర్
ఈ సన్నివేశం థియేటర్లో పడితే ఇంకా బాగుండేదని నాని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డిలేటెడ్ సీన్ వైరల్ అవుతోంది. ఇక ఈ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘శ్యామ్ సింగ రాయ్’ లాంటి విభిన్నమైన కథతో నాని చేసిన ప్రయత్నం పేక్షకులను థ్రిల్ చేసిందనే చెప్పాలి.