విశ్వనటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన బ్యూటీ శృతి హాసన్. ప్రస్తుతం శ్రుతి వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక మరోపక్క సోషల్ మీడియాలో అమ్మడి ఫ్యాషన్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు పిచ్చి ఎక్కిస్తుంది. తాజాగా శృతి పోస్ట్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు ” ఏ ఎవరు నువ్వు.. ఇలా ఉన్నావేంటీ” అంటూ సునీల్ డైలాగ్ కొడుతున్నారు. పాశ్చాత్య ధోరణితో వెరైటీ ఫ్యాషనిస్టాగా ఈ భామ మారిపోయిన సంగతి తెలిసిందే. మంత్రగత్తె, మాయల మరాఠి అంటూ ఎన్నిసార్లు అభిమానులు కామెంట్స్ చేసినా అమ్మడితో ఇసుమంతైనా మార్పు రాలేదు.
మరోసారి శృతిలోని ఫ్యాషన్ పిచ్చి తలుపు తెరిచింది. గోథిక్ మేకప్ తో మరోసారి అభిమానులపై విరుచుకుపడింది. జుట్టును రెండు వైపులా ముడి వేసి, గోథిక్ మేకప్ తో క్లోజప్ షాట్స్ తో కిర్రెక్కించింది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు పిచ్చి పట్టిందా..? దెయ్యం పట్టిందా..? అంత దగ్గరగా చూస్తే భయమేస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
