Site icon NTV Telugu

Shruti Haasan : కరోనా పాజిటివ్… ఫన్ కాదు

Shruti-Haasan

స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌ చివరిసారిగా అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ “బెస్ట్ సెల్లర్‌”లో కనిపించింది. ఇందులో మిథున్ చక్రవర్తి, శ్రుతి హాసన్, అర్జన్ బజ్వా, గౌహర్ ఖాన్, సత్యజీత్ దూబే, సోనలీ కులకర్ణి కూడా నటించారు. ప్రస్తుతం శృతి… ప్రభాస్‌తో పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’ చిత్రంలో నటిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు దర్శకుడు గోపీచంద్ మలినేనితో నందమూరి బాలకృష్ణ “NBK 107” సినిమా కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో శృతి హాసన్ తనకు కరోనా సోకిందంటూ చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది.

Read Also : Samantha : ‘గంగూబాయి కథియవాడి’పై సామ్ రివ్యూ… హైలెట్స్ ఇవే !

అన్ని భద్రతా చర్యలను అనుసరించినప్పటికీ కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. కరోనా పాజిటివ్ గా వచ్చిందని తన అభిమానులకు తెలియజేస్తూ శృతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫిబ్రవరి 27 ఆదివారం నాడు తనకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందంటూ ‘త్వరగా అంత సరదాగా లేదు’ అప్‌డేట్‌ ను పంచుకుంది. ఆ నోట్‌ లో “అందరికీ నమస్కారం! ఇది అంత సరదాగా ఉండదు. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ, నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నేను కోలుకుంటున్నాను. త్వరలో ఆరోగ్యంతో తిరిగి వస్తాను ! ధన్యవాదాలు, త్వరలో కలుద్దాం లవ్లీస్” అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు శృతి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇక గత ఏడాది శృతి తండ్రి కమల్ హాసన్ కూడా కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.

Exit mobile version