NTV Telugu Site icon

Mega 154 : శృతి హాసన్ బ్యాక్ టు షూట్

Shruti Haasan

Shruti Haasan

సౌత్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ బ్యాక్ టు షూట్ అంటోంది. అస్సాంలో తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో కొంత క్వాలిటీ టైంను ఆస్వాదించిన తర్వాత శృతి తిరిగి పనిలో పడింది. ఆమె తన తాజా ప్రాజెక్ట్ “మెగా154” షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది శృతి హాసన్. షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయిన విషయాన్ని శృతి ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే “మెగా154” ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో చిరంజీవి సరికొత్త మేకోవర్ లో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read Also : Nikesha Patel : ఏ మెగా స్టార్ గురించి మాట్లాడుతున్నారు ? నెటిజన్ కు పవన్ హీరోయిన్ ప్రశ్న

మరోవైపు ప్రశాంత్ నీల్ యాక్షన్ డ్రామా “సలార్‌”లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో శృతి హాసన్ జోడి కట్టబోతోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. అంతేకాకుండా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న “NBK107″లో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించబోతోంది.