Site icon NTV Telugu

Shruti Haasan : ఆమె మీద ఇష్టం తోనే నాన్న ఆ పని చేశారు..

Sruthi Hasson

Sruthi Hasson

కమల్ హాసన్ వ్యక్తిత్వం, ఆయన లైఫ్‌స్టైల్ ఎప్పుడూ ఫ్యాన్స్‌కి ఆసక్తికరమే. తాజాగా ఆయన కూతురు శృతి హాసన్ ఓ సీక్రెట్ రివీల్ చేసింది. ‘కూలీ’ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కమల్ హాసన్ ఎందుకు బెంగాలీ భాష నేర్చుకున్నారో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఆసక్తికరమైన విషయానికి కారణం ఒక ప్రముఖ నటి, దర్శకురాలు.. మరి ఎవరో తెలుసా?’

Also Read : SS Rajamouli : థియేటర్, OTT కి మధ్య తేడా ఇదే..

ఇంటర్వ్యూలో సత్యరాజ్ మాట్లాడుతూ.. ‘కమల్ హాసన్ అన్నింటినీ చాలా త్వరగా నేర్చుకుంటాడు. ఆయన బెంగాలీ భాష కూడా నేర్చుకున్నాడు” అని చెప్పగా, వెంటనే శృతి మధ్యలో చొరవ తీసుకుంటూ, ఆ సీక్రెట్ రివీల్ చేసింది.“నాన్న బెంగాలీ ఎందుకు నేర్చుకున్నాడో తెలుసా? ఆయనకు బెంగాలీ డైరెక్టర్, నటి అపర్ణ సేన్ అంటే విపరీతమైన ఇష్టం. ఆమెను ఇంప్రెస్ చేయడానికి బెంగాలీ నేర్చుకున్నాడు. అంతే కాదు, హేరామ్ సినిమాలో రాణి ముఖర్జీ పాత్ర పేరు కూడా అపర్ణగానే పెట్టాడు. ఇదంతా నాన్న అపర్ణ పై ఉన్న అభిమానమే!” అని శృతి తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కమల్ హాసన్ వ్యక్తిత్వంపై మళ్లీ చర్చ మొదలుపెట్టారు. కమల్ హాసన్ అభిమానులు, శృతి హాసన్ ఈ రివీలేషన్‌తో “నాన్న లవ్ స్టోరీలు కూడా సినిమాల్లాగే ఆసక్తికరంగా ఉంటాయి” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

Exit mobile version