శంతను హాజారికాతో నాలుగేళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పిన శృతి హాసన్.. మళ్లీ యాక్టింగ్‌పై సీరియస్‌గానే ఫోకస్ చేసింది. కానీ మునుపుటిలా మెరుపులు చూపించడం లేదు. చేస్తున్న సినిమాలలో కూడా తనకంటే పక్క హీరోయిన్స్ కె ఎక్కవ గుర్తింపు వస్తుంది. రజనీకాంత్ నటించిన కూలీలో హీరోయిన్ శృతినే అయినప్పటికీ క్రెడిట్ మొత్తం కొట్టేసింది పూజా హెగ్డే. మెనికా బెలూచి అంటూ మూడు నిమిషాల పాటు ఐటమ్ సాంగ్‌లో చిందులేసి ఆడియన్స్ దిల్ దోచేసింది బుట్టబొమ్మ.
పెద్దిలో ఐటమ్ సాంగ్ చేసింది అన్నమాటే కానీ ఎక్కడా శృతి హాసన్ పేరు పెద్దగా డిస్కర్షన్‌లో నిలిచినట్లు లేదు. పెప్ సాంగ్‌లో కూడా జాన్వీ స్టీల్ ద ఫెర్ఫామెన్స్ కాబట్టి.. శృతికి సరైన ఐడెంటిటీ దక్కలేదు. జాన్వీపై వచ్చిన నెగిటివిటీ కూడా శృతి స్పెషల్ సాంగ్ చేసిందన్న విషయం ఆడియన్స్‌కు కనెక్ట్ కాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటో షూట్స్‌తో బిజీగా గడుపుతోన్న శృతి హాసన్ చేతిలో టూ, త్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. విజయ్ సేతుపతి హీరోగా ఎప్పుడో కంప్లీటైన థియేటర్స్‌లో రావడానికి మీన మేషాలు లెక్కిస్తోంది. ఇక సలార్2 ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదు. ఆకాశంలో ఓ తారలో డిఫరెంట్ రోల్‌లో మెరవబోతుంది కమల్ డాటర్. మరీ ఈ మూవీ అయినా తనతో పాటు ఆడియన్స్‌కు గుర్తిండిపోయే రోల్ అవుతుందో లేదో చూడాలి. అన్నట్టు అడివి శేష్ హీరోగా వచ్చిన డెకాయిట్ లోను మొదట హీరోయిన్ గా శృతి హాసన్ ను తీసుకున్నారు కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా నుండి వైదొలిగింది.

