Site icon NTV Telugu

Shruthi Hasan : బ్లూ కలర్ శారీలో అదరగొడుతున్న హాట్ బ్యూటీ..

Whatsapp Image 2023 07 19 At 8.17.40 Am

Whatsapp Image 2023 07 19 At 8.17.40 Am

స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ భామ విశ్వ నటుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన ఈ భామ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని అతి తక్కువ సమయంలో హీరోయిన్ గా కూడా అవకాశం అందుకుంది. పలు సినిమాలలో పాటలుపాడి తనలోనీ సింగింగ్ టాలెంట్ కూడా బయట పెట్టింది.ఇక ఈమె హీరోయిన్ గా తన మొదటి సినిమాను బాలీవుడ్ లో చేసింది. ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీకి అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో పరిచయమైంది. ఆ సినిమా నిరాశపరిచింది. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ భామ కెరీర్ టర్న్ చేసింది గబ్బర్ సింగ్ సినిమా.. ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

తెలుగు మరియు హిందీలోనే కాకుండా తమిళంలో కూడా నటించింది. ఇక శృతిహాసన్ వ్యక్తిగత కారణాల వల్ల తను కొన్నాళ్ళు సినిమాలకు  బ్రేక్ ఇచ్చింది. ఇక మళ్లీ రవితేజ నటించిన క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా అవకాశాలు అందుకుంది. వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తుంది.ఈ భామ సోషల్ మీడియాలో ఎంతగానో యాక్టివ్ గా కనిపిస్తుంది. సమయం దొరికితే తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది. తాజాగా  బ్లూకలర్ చీరతో దర్శనమిచ్చి అందరికీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.  ఈ బ్యూటీ ఎప్పుడు కూడా బ్లాక్ కలర్ మాత్రమే ధరిస్తూ ఉంటుంది. ఏ డ్రెస్ వేసుకున్నా కూడా అది ఖచ్చితంగా బ్లాక్ కలర్ లో అయితే ఉంటుంది. తనకు బ్లాక్ కలర్ చాలా ఇష్టం కాబట్టి నిత్యం బ్లాక్ కలర్ ధరిస్తూ ఉంటాను అని గతంలో ఎన్నో సార్లు చెప్పుకొచ్చింది.అయితే తాజాగా తన ఇన్ స్టాలో ఒక స్టోరీనీ పంచుకుంది.అందులో తను బ్లూ కలర్ సారీ ధరించి కలర్ ఫుల్ గా కనిపించింది. ఇక ఆ ఫోటో చూసి తన ఫ్యాన్స్ చీరలో అచ్చం పెళ్లి కూతురు లాగా ఉన్నావు అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.

Exit mobile version