Site icon NTV Telugu

వైరల్ వీడియో : శ్రియా సీక్రెట్ కు ఏడాది !

Shriya-baby

దాదాపు అందరు ప్రముఖ టాలీవుడ్ హీరోలు అందరితో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్న బ్యూటీ శ్రియా శరణ్. పెళ్ళి అయ్యి, ఒక కూతురు ఉన్న శ్రియా ఇప్పటికీ స్టార్ హీరోలతో జతకడుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఆమె రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో కనిపించబోతోంది. అయితే శ్రియా తాజాగా ఓ వీడియోను షేర్ చేస్తూ తన సీక్రెట్ కు ఏడాది పూర్తయినట్టు తెలిపింది. లాక్ డౌన్ లో భర్తతో పాటు విదేశాల్లో గడిపిన శ్రియ ఒకరోజు హఠాత్తుగా బేబీతో కన్పించి షాక్ ఇచ్చింది. లాక్ డౌన్ లోనే పాప పుట్టినట్టు మరో వీడియోలో వెల్లడించింది. అప్పటి వరకూ ఆ విషయంలో చాలా సీక్రెట్ మైంటైన్ చేసింది. తాజాగా తన పాపకు ఏడాది పూర్తయ్యింది అంటూ కొన్ని వీడియోలు, ఫోటోలు షేర్ చేసింది శ్రియా.

Read Also : యంగ్ టైగర్ న్యూ లుక్… కోర మీసంతో క్లాసీ పిక్

ఆ వీడియోలో శ్రియ పాపతో సరదాగా గడుపుతూ కన్పించింది. “మీరు ఇంకా ఆమెను కలవలేదు.. ఆమెకు మీ ప్రేమను అందించండి. ఆమె ప్రతిచోటా స్నేహితులను సంపాదించుకోవాలని, విశ్వం నుండి ప్రేమను పొందాలని, అదృష్టం, ఆనందం ఆమె ఉత్తమ స్నేహితురాలు కావాలని నేను ప్రార్థిస్తున్నాను” అంటూ బేబీపై ప్రేమను కురిపించింది ఈ స్టార్ మామ్. ఈ పోస్ట్ శ్రియ అభిమానులు, శ్రేయోభిలాషుల దృష్టిని ఆకర్షించింది. శ్రియ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే అందులోని ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. పాపకు శ్రియ అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.

View this post on Instagram

A post shared by Shriya Saran (@shriya_saran1109)

Exit mobile version