Shriya Saran: ‘మ్యూజిక్ స్కూల్’ మూడో షెడ్యూల్ పూర్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shriya Saran ‘Music School’ Movie 3rd Schedule Completed.
ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్న ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా మూడో షెడ్యూల్ పూర్తయింది. పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. తాజాగా 45 రోజుల పాటు సాగిన మూడో షెడ్యూల్‌తో 10 పాటల చిత్రీకరణ కూడా పూర్తి చేశారు. ఇంకో పాట చిత్రీకరణ మాత్రం మిగిలింది. చిన్ని ప్రకాష్, రాజు సుందరం ఈ పాటలకు కొరియోగ్రఫీ చేశారు. తొలి రెండు షెడ్యూళ్లకు బ్రాడ్వే కొరియోగ్రాఫర్ ఆడం ముర్రే నృత్య దర్శకత్వం వహించారు. ప్రేక్షకులకు గుర్తుండిపోయే మ్యూజికల్ సినిమాను ఇవ్వాలన్న ఆకాంక్షతో మేకర్స్ ఫైనల్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read
- Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
- Kabir Duhan Singh: 'హనుమాన్ అంశ్' బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
ఈ సందర్భంగా శ్రియా శరణ్ మాట్లాడుతూ ”అమేజింగ్ షూట్ కంప్లీట్ చేశాం. వి లవ్ యూ కిరణ్ సార్. చిన్ని ప్రకాష్ సార్, రాజు మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బావుంది. షర్మన్‌తోనూ, పలువురు చైల్డ్ ఆర్టిస్టులతోనూ షూటింగ్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా చేస్తున్నందుకు పాపారావు సార్‌కి ధన్యవాదాలు” అని అన్నారు. షర్మన్ జోషి మాట్లాడుతూ ”మూవీ మూడో షెడ్యూల్ పూర్తయింది. చాలా మంది పిల్లలు పార్టిసిపేట్ చేసిన డ్యాన్సులు, పాటల సీక్వెన్స్ లు పూర్తి చేశాం. రావుగారి టీమ్ చాలా బాగా హ్యాండిల్ చేసింది. ప్రతి విభాగంలోనూ ఎక్సలెన్స్ కోసం పాటుపడుతూ ముందుకు సాగుతుంటే ఆనందంగా ఉంది” అని అన్నారు. దర్శకుడు పాపారావు బియ్యాల మాట్లాడుతూ ”నటీనటులందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా పిల్లలు చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
బెటర్ ఔట్పుట్ కోసం నేను ప్రత్యేకించి ఎవరినీ అడగలేదు. అందరూ అంతగా ఇన్వాల్వ్ అయి చేశారు. 80 శాతం షూటింగ్ పూర్తయింది. మేం అనుకున్న టైమ్ ప్రకారం సినిమా పూర్తవుతుందనే నమ్మకం ఉంది” అని అన్నారు. సినిమాటోగ్రాఫర్ కిరణ్ డియోహాన్స్ మాట్లాడుతూ ”45 రోజుల అద్భుతమైన షెడ్యూల్‌ని పూర్తి చేశాం. యామిని ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరిగింది. శ్రియా శరణ్, షర్మన్ జోషీ, ప్రకాష్‌రాజ్‌గారితో పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. చాలా స్మూత్‌గా పనిచేశాం” అని అన్నారు. హిందీ, తెలుగులో ఈ ‘మ్యూజిక్ స్కూల్’ను తెరకెక్కిస్తున్నారు.
తాజావార్తలు
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!