NTV Telugu Site icon

Shriya: ఎలా శ్రీయా.. ఇంత అందాన్ని మెయింటైన్ చేస్తున్నావ్…

Shriya Sharan

Shriya Sharan

ఏ ఇండస్ట్రీలోకైనా కొత్త నీరు వచ్చే కొద్దీ పాత నీరు పోతూ ఉంటుంది. ఇది ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా జరుగుతున్నదే. ఫిల్మ్ ఇండస్ట్రీలో, మరీ ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. యంగ్ హీరోయిన్, కొంచెం స్పార్క్ ఉన్న హీరోయిన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే చాలు పాత హీరోయిన్స్ కి కష్టాలు మొదలవుతాయి. దర్శక నిర్మాతలు హీరో సినీ అభిమానులు ఆ కొత్త హీరోయిన్ వెనక పడతారు, పాత హీరోయిన్ కి అవకాశాలతో పాటు ఫాలోయింగ్ కూడా తగ్గిపోతుంది. పూజా హెడ్గే, రష్మిక, కృతి శెట్టి, శ్రీలీలా ఇలా ఒక్కో టైంలో ఒక్కో హీరోయిన్ ట్రెండ్ లో ఉంటుంది. అయితే ఎంతమంది హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చినా, తమ గ్లామర్ ని ఎంతగా చూపించినా ఒక్క హీరోయిన్ ఇమేజ్ అండ్ గ్లామర్ మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది.

రెండు దశాబ్దాల క్రితం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రియ శరన్ ఇప్పటికీ డెబ్యు మూవీలో ఎంత అందంగా ఉందో, అంతే అందంగా ఉంది. ఇంఫాక్ట్ ఇప్పుడు ఇంకా అందంగా ఉంది. గ్లామర్ క్వీన్ అనే పదానికే నిలువెత్తు నిదర్శనంలా ఉన్న శ్రియా రోజు రోజుకీ అందంగా మారుతూనే ఉంది. అసలు ఈమెకి నలబై ఏళ్ల వయసుందా? పెళ్లి అయ్యి ఒక కూతురు కూడా ఉందా అని అనుమానం వచ్చే రేంజులో ఉంది శ్రియ. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోస్ తో సోషల్ మీడియాలో హీట్ పెంచే శ్రియా లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే నీ అందం ముందు యంగ్ హీరోయిన్స్ కూడా పనికి రారు అని ఎవరైనా అనాల్సిందే. శ్రియ ఒక్క సాలిడ్ కంబ్యాక్ ఇస్తే ఈరోజు ఉన్న యంగ్ హీరోయిన్స్ కి టఫ్ కాంపిటీషన్ ఇవ్వగలదు. బ్యూటీ ఎట్ ఇట్స్ బెస్ట్ అనేలా ఉండే శ్రియ, కుర్ర హీరోయిన్లు కూడా కుల్లు కునేలా చేస్తోంది.

Show comments