Shreyas Talpade: ఓమ్ శాంతి ఓమ్, గోల్ మాల్ రిటర్న్స్, గోల్ మాల్ 3, గోల్ మాల్ అగైన్, హౌజ్ ఫుల్ 2 లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు యాక్టర్ శ్రేయస్ తల్పడే. పుష్ప ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకి హిందీలో డబ్బింగ్ చెప్పాడు శ్రేయస్ తల్పడే. ప్రస్తుతం వెల్కమ్ టు జంగల్ సినిమాలో నటిస్తున్న శ్రేయస్ తల్పడేకి హార్ట్ ఎటాక్ రావడంతో హాస్పిటల్ కి తరలించారు. గురువారం సాయంత్రం గుండెపోటు రావడంతో శ్రేయాస్ తల్పడేని ముంబైలోని అంధేరీ ప్రాంతంలోని బెల్లేవ్ ఆసుపత్రి అడ్మిట్ చేసారు. ఈరోజు యాంజియోప్లాస్టీ ట్రీట్మెంట్ చేయడంతో శ్రేయస్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరి కొన్ని రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ముంబైలో ‘వెల్కమ్ టు జంగల్’ షూట్ చేసిన తర్వాత గుండెపోటు రావడంతో శ్రేయాస్ తల్పాడే కుప్పకూలిపోయాడు.
Read Also: Annapoorani OTT Release Date: నయనతార అన్నపూర్ణి ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. ఎక్కడంటే?