Shreya Reddy Joins OG Shoot: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయం చేస్తూ మరోపక్క సినిమాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ఆయన అనేక సినిమాలను లైన్లో పెట్టారు. ఒక సినిమా షూటింగ్ గ్యాప్ లో మరో సినిమా షూటింగ్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతానికి సినిమాలన్నీ పక్కనపెట్టి వారాహి యాత్ర పేరుతో ఆయన ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ యాత్ర మొదలు పెట్టబోతున్నారు. అయితే ఆయన హీరోగా సాహో సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే సినిమా రూపొందుతోంది. డివివి దానయ్య నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విశాల్ వదిన శ్రేయ రెడ్డి ఒక కీలక పాత్రలో నటిస్తోంది.
Also Read: Lavanya Tripati : పెళ్లి చేసుకోవడానికి కండిషన్ పెట్టిన లావణ్య త్రిపాఠి..?
ఈ మేరకు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ రోజు నుంచి ఆమె సినిమా సెట్స్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన సందర్భంగా శ్రేయ రెడ్డి తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నేను ఈ స్క్రిప్ట్‌ని చదివి 5 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో “ఎస్” అని చెప్పాను! సుజీత్ చాలా అందంగా రాసుకున్న ఈ పాత్రకు ఉన్న పవర్ అదే! అని ఆమె పేర్కొన్నారు. P.K సార్ అపురూపమైన వెలుగు ఉన్న అద్భుతమైన వ్యక్తి! ఆయన బలం ఖచ్చితంగా ఆయన పంచె మంచితనం లోనే ఉంది! సుజీత్ కూడా దాదాపు ఇలాంటి రత్నమే. అందుకే అంత మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్ రాసుకున్నాడు.
Also Read: Jabardasth Ritu Choudhary: రీతూ చౌదరి రహస్యంగా పెళ్లి చేసుకుందా?
అలాగే మరో పక్క అందరికీ తెలిసిన రవి కె చంద్రన్, OGకి ఒక వరం, ఆశీర్వాదం. ప్రకాష్ రాజ్ మా ఫ్యామిలీ లానే ఆయనతో మళ్లీ పనిచేయడం ఒక స్వచ్ఛమైన ఆనందం, దానయ్య సార్ చాలా మంచి వారు అని రాసుకొచ్చారు. ఇక వారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. OGతో, మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలియదు, సరిహద్దులు చెరిగిపోతాయి, కొత్త బెంచ్‌మార్క్‌లు సెట్ చేయబడతాయి, ఈ రోలర్ కోస్టర్ రైడ్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ ఆమె రాసుకొచ్చింది. ఇక ఆమె చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఓజీ సినిమా అనేక సంచలనాలు సృష్టించేందుకు సిద్ధం అవుతుందని అర్ధం అవుతోంది.