Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shraddha Kapoor: బాలీవుడ్లో ‘స్త్రీ 2’తో భారీ విజయాన్ని అందుకున్న శ్రద్ధా కపూర్ ఇప్పుడు మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలను ఎంచుకుంటున్న ఆమె, దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్న ‘ఈత’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 28న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్లు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
‘ఈత’ సినిమా మరాఠీ జానపద కళారంగంలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ కళాకారిణి విఠాబాయి భావు మాంగ్ నారాయణ్గావ్కర్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ‘తమాషా రాణి’గా పేరొందిన ఆమె ఎన్నో దశాబ్దాల పాటు రంగస్థలాన్ని తన నటన, నృత్యంతో అలరించారు. ముఖ్యంగా నిండు గర్భవతిగా ఉన్న సమయంలో ఒక ప్రదర్శన పూర్తయ్యాక వేదిక వెనుకే బిడ్డకు జన్మనిచ్చి, అనంతరం మళ్లీ కళ కోసం అంకితభావంతో పనిచేసిన సంఘటన ఆమె జీవితంలో అత్యంత విశేషంగా నిలిచింది. ఈ అసాధారణ ప్రయాణాన్ని వెండితెరపై ఆవిష్కరించాలనే ఉద్దేశంతో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ సంవత్సరాల పాటు పరిశోధన చేసి ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై మంచి ఆసక్తిని పెంచింది. శ్రద్ధా కపూర్ లుక్‌తో పాటు సినిమా నేపథ్యం కూడా ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది. అయితే సినిమా కథ కంటే ప్రస్తుతం దాని టైటిల్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది.
Also Read
‘ఈత’ అనే పేరును చిత్రానికి పెట్టడంపై విఠాబాయి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఈత’ టైటిల్‌ను ఉపయోగించడం కంటే, ఆమె జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్నందున విఠాబాయి అసలు పేరునే సినిమాకు పెట్టాల్సిందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో నిర్మాతలు, చిత్రబృందంపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో సినిమా విడుదలకు ముందు అనూహ్యంగా లీగల్ వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు ఈ ఆరోపణలపై దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ గానీ, నిర్మాణ సంస్థ గానీ అధికారికంగా స్పందించలేదు. పరిస్థితి ఎలా మారుతుందన్న దానిపై బాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ చిత్రం తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో విడుదల కానుండటం విశేషం. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్‌తో పాటు రణదీప్ హూడా, మహమ్మద్ జీషన్ అయ్యూబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ బయోగ్రాఫికల్ డ్రామా విడుదలకు ముందే వివాదంలో చిక్కుకోవడంతో, ఇప్పుడు సినిమా కథతో పాటు ఈ లీగల్ అంశం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
- Tags
- cinema
- Shraddha kapoor
తాజావార్తలు
-
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
-
Indian Navy: భారత నౌకాదళంలోకి 8 కొత్త స్టెల్త్ యుద్ధనౌకలు.. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
-
PM Modi’s Big Statement: దేశాభివృద్ధి కొంతమందికి నచ్చడం లేదు.. ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఫైర్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Terror Funding Case: జమ్మూ కాశ్మీర్లో టెర్రర్ ఫండింగ్ ముఠా గుట్టురట్టు.. 10 మంది అరెస్ట్
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!