NTV Telugu Site icon

Double Ismart: రామ్ కోసం బాలీవుడ్ భామను దింపుతున్న పూరీ

Double Ismart

Double Ismart

Shraddha Kapoor opposite ram in Double Ismart: పూరి జగన్నాథ్ లైగర్ తర్వాత చాలా డీలా పడిపోయాడు. ఒకరకంగా ఆయన అసలు ఎక్కడ ఉంటున్నాడో? ఏం చేస్తున్నాడో? కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కొంతకాలం క్రితం పూరి జగన్నాథ్ తన సోదరుడు పెట్ల గణేష్ ఇంట పూజా కార్యక్రమాల్లో కనిపించాడు. ఇక అప్పుడే సినిమా కూడా అనౌన్స్ చేస్తాడని ఊహాగానాలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయనే అంశం మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు కానీ కొద్ది రోజుల క్రితం జూలై 9వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని 12వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాదని మీడియాకి లీకులు అందాయి.

Pawan Kalyan: నేను ఎందుకు ఇన్ని దెబ్బలు, అవమానాలు పడాలి?

అయితే ఈ రోజు పూజా కార్యక్రమాలు జరిగిన విషయం కూడా బయటికి రాలేదు కానీ సినిమా యూనిట్ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రకటన వచ్చింది. రేపు ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ ప్రకటిస్తామని పూరీ కనెక్ట్స్ సంస్థ ప్రకటించింది. అయితే ఆ అప్డేట్ ఏమిటి? అనే విషయం నాకు క్లారిటీ లేదు కానీ ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్లు, ఇతర టెక్నీషియన్ల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదేమిటంటే రామ్ హీరోగా ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్గా కనిపించబోతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఇంటర్నేషనల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక పూరీ కనెక్ట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుండగా ఛార్మి, పూరి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

Show comments