Site icon NTV Telugu

Kaathu Vaakula Rendu Kaadhal : ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన సామ్

Samantha

Kaathu Vaakula Rendu Kaadhal సినిమా షూటింగ్ పై తాజా అప్డేట్ ను సామ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సమంత, నయనతార, విజయ్ సేతుపతి “కాతు వాకుల రెండు కాదల్‌” అనే సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. “కాతు వాకుల రెండు కాదల్” చిత్రాన్ని రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 28న ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ థియేటర్లలోకి రానుంది. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.

Read Also : KGF Chapter 2 : సెన్సార్ పూర్తి… రన్ టైమ్ ఎంతంటే ?

ఇదే విషయాన్నీ సామ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ప్రేక్షకులు సినిమాను చూసి కడుపుబ్బా నవ్వుతారని హామీ ఇచ్చింది. ఈ రోమ్-కామ్ మూవీ షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్రబృందం కేక్ కోసిన పిక్స్ ను సామ్ షేర్ చేసుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని “కన్మణి రాంబో ఖతీజా” పేరుతో విడుదల చేయబోతున్నారు. కాగా సమంత ప్రస్తుతం దర్శక ద్వయం హరి అండ్ హరీష్ దర్శకత్వం వహిస్తున్న పాన్-ఇండియన్ థ్రిల్లర్ “యశోద” షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు సామ్ గుణశేఖర్ పౌరాణిక చిత్రం “శాకుంతలం”, హాలీవుడ్ చిత్రం “అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్”, రస్సో బ్రదర్స్ “సిటాడెల్” వంటి చిత్రాలలో కూడా సామ్ కనిపించనుంది.

Exit mobile version