NTV Telugu Site icon

Manchu Vishnu Bhaktha Kannappa: షాకింగ్… శివుడిగా ‘శివన్న’? ప్రభాస్ కాదు…

Manchu Vishnu Bhaktha Kannappa

Manchu Vishnu Bhaktha Kannappa

డైనమిక్ హీరో మంచు విష్ణు భారీ బడ్జట్ తో ప్రొడ్యూస్ చేస్తూ హీరోగా నటిస్తున్న సినిమా ‘భక్త కన్నప్ప’. దాదాపు వంద కోట్ల బడ్జట్ తో రూపొందుతున్న ఈ మూవీపై మంచు విష్ణు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. న్యూజిల్యాండ్ లో భక్త కన్నప్ప రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. మొత్తం కాస్ట్ అండ్ క్రూ న్యూజిల్యాండ్ లో భారీ సెటప్ లో భక్త కన్నప్ప సినిమా చేస్తున్నారు. ప్రభాస్ ‘శివుడి’ పాత్రలో నటిస్తున్నాడు, నయనతార ‘పార్వతిదేవి’గా నటిస్తోంది, మోహన్ లాల్ మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు అనే వార్తలు బయటకి రాగానే భక్త కన్నప్ప సినిమా ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది.

Read Also: Mrunal Thakur: బ్లాక్ డ్రెస్‌లో మురిపిస్తున్న మృణాల్ ఠాకూర్

ప్రభాస్ శివుని పాత్రలో అనే మాట భక్త సినిమాపై అందరి దృష్టి పడేలా చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఏకంగా AI టెక్నాలజీ వాడుతూ శివుడిగా ప్రభాస్ ఎలా కనిపిస్తాడు అనే ఇమేజస్ ని క్రియేట్ చేస్తున్నారు.  సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ AI ఫోటోస్ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి. ఈ జోష్ లో ఉన్న ఫ్యాన్స్ కి స్వీట్ షాక్ ఇచ్చింది ఒక రూమర్. భక్త కన్నప్ప సినిమా గురించి లేటెస్ట్ గా ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ బయటకి వచ్చింది. భక్త కన్నప్ప సినిమాలో ‘శివుడి’గా నటిస్తుంది ప్రభాస్ కాదట. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ అకా శివన్న భక్త కన్నప్ప సినిమాలో ‘శివుడి’గా కనిపించనున్నాడట. ప్రభాస్ కూడా భక్త కన్నప్ప సినిమాలో ఉన్నాడు కానీ ‘శివుడి’గా కాదు శివుడి రూపంగా మాత్రమేనట. శివుడు మానవ రూపంలో ప్రభాస్ కనిపిస్తాడట, అందుకే ప్రభాస్ స్క్రీన్ టైమ్ కూడా తక్కువని సమాచారం.

Read Also: LEO : ప్రభాస్ సలార్ రికార్డు క్రాస్ చేసిన లియో..