Site icon NTV Telugu

Shobana : చెట్టు వెనక బట్టలు మార్చుకోవాలన్నారు.. నటి శోభన షాకింగ్ కామెంట్స్..

Shobana

Shobana

Shobana : నటి శోభన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. కేరళకు చెందిన ఈమె.. తెలుగుతో పాటు, తమిళం, మలయాళంలో కూడా ఎన్నో సినిమాలు చేసింది. కల్కి సినిమాలో నటించింది. అయితే తన లైఫ్ లో జరిగిన ఓ షాకింగ్ ఇన్సిడెంట్ ను బయట పెట్టేసింది. నేను అమితాబ్ బచ్చన్ గారితో చాలా సినిమాలు చేశాను. ఆయన ఎంతో మంచి వ్యక్తి. గతంలో ఆయనతో ఓ సినిమా షూట్ కోసం అహ్మదాబాద్ కు వెళ్లాను.

Read Also : SSMB-29 : మహేశ్-రాజమౌళి మూవీ కోసం క్రేజీ యాక్టర్..?

అప్పుడు హీరోయిన్లకు కారవాన్ లు ఇవ్వట్లేదు. సాంగ్ షూట్ కోసం బట్టలు మార్చుకోవాలి. అమితాబ్ గారికి కారవాన్ ఇచ్చారు. కానీ నాకు కారవాన్ లేదు. చెట్టు పక్కకు వెళ్లి బట్టలు మార్చుకోమని మూవీ టీమ్ చెప్పారు. నాకు చాలా బాధేసింది. ఆమె కేరళ నుంచి వచ్చింది. దేనికైనా అడ్జస్ట్ అవుతుంది అంటూ మాట్లాడారు. ఈ విషయాలు అమితాబ్ గారికి తెలిసింది. ఆయన వెంటనే కారవాన్ నుంచి బయటకు వచ్చి చాలా సీరియస్ అయ్యారు. మూవీ టీమ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నాకు తన కారవాన్ ఇచ్చి బట్టలు మార్చుకోమన్నారు’ అంటూ చెప్పుకొచ్చింది శోభన.

Read Also : Pawan Kalyan: లుక్ మార్చిన పవన్ కళ్యాణ్

Exit mobile version