Site icon NTV Telugu

Kamal Hasan : కమల్ కోసం గొడవ పడ్డాను.. శివరాజ్ కుమార్ ఇంటరెస్టింగ్ కామెంట్స్..

Shivarajkumar

Shivarajkumar

Kamal Hasan : కమల్ హాసన్ నటించిన తాజా మూవీ థగ్ లైఫ్‌. మణిరత్నం డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ను చెన్నై వేదికగా నిర్వహించారు. శింబు, త్రిష కీలక పాత్రలు చేస్తున్నారు. ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈవెంట్ లో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘కమల్ హాసన్ కు నేను చాలా పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాలు ప్రతీదీ మొదటి రోజే చూస్తాను. ఆయన వ్యక్తిత్వం అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన నటనను చూసి చాలా నేర్చుకుంటున్నాను.

Read Also : Ambati Rambabu: టీడీపీ నాయకుల హత్యలకు పిన్నెల్లికి ఏంటి సంబంధం?

ఆయన బెంగుళూరులోని తన ఇంటికి వచ్చినప్పుడు నేను వెళ్లి కలుస్తుంటాను. చాలా విషయాలు ఇద్దరం చర్చించుకుంటాం. మా తండ్రి రాజ్ కుమార్ తో కమల్ హాసన్ చాలా సార్లు మాట్లాడేవారు. అందుకే ఆయన్ను హగ్ ఇవ్వమని అడిగాను. ఆయన గురించి ఎవరు చెడుగా మాట్లాడినా సరే గొడవపడేవాడిని. అది ఆయన మీదున్న గౌరవం అనుకుంటాను. నాకు క్యాన్సర్ సర్జరీ అయినప్పుడు కూడా కమల్ హాసన్ గారు స్పెషల్ గా ఫోన్ చేసి మాట్లాడారు. నాకు చాలా ధైర్యం ఇచ్చారు. మా నాన్నే స్వయంగా నాకు ధైర్యం చెప్పినట్టు అనిపించింది. ఆయన చాలా మంచి మనసున్న వ్యక్తి. థగ్ లైఫ్ ను అందరూ ఎంజాయ్ చేస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

Read Also : HHVM : నైజాంలో వీరమల్లుకు భారీ డిమాండ్..!

Exit mobile version