NTV Telugu Site icon

Shivani Rajasekhar : మిస్ ఇండియా రేసులో రాజశేఖర్ తనయ

Shivani Rajasekhar

Shivani Rajasekhar

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్, జీవితల పెద్ద కుమార్తె శివాని సిల్వర్ స్క్రీన్ అరంగేట్రం చేసినప్పటికీ, స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోయింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన “అద్భుతం” చిత్రంతో OTT ప్లాట్‌ఫామ్‌లో అడుగు పెట్టింది. OTTలో ఈ సినిమాతో పాటు ఆమె రెండవ చిత్రం ‘WWW’కి కూడా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు సినిమాల సంగతి పక్కన పెట్టి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంటోంది. తాజాగా శివాని తన ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్ ద్వారా మిస్ ఇండియా రేస్‌లో పాల్గొంటున్నట్లు ప్రకటించింది.

Read Also : Narayan Das K Narang : ప్రముఖ నిర్మాత కన్నుమూత

“కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టాను. విష్ మి లక్ ! మిస్ ఇండియా ఆర్గ్ ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కృతజ్ఞత, గౌరవం. ఈ రోజు ఆడిషన్స్‌లో ముందుకు సాగుతూ తమ తమ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అందమైన మహిళలందరికీ (నాతో సహా) ఆల్ ది వెరీ బెస్ట్” అంటూ రాసుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే… శివాని తన తండ్రి రాజశేఖర్ హీరోగా నటిస్తున్న చిత్రం “శేఖర్”లో అతిథి పాత్రలో కనిపించబోతోంది. ఈ మూవీ వచ్చే మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి మిస్ ఇండియా రేసులో శివాని ప్రయాణం ఎలా ఉండబోతుందో చూడాలి.

Shivani

Show comments