Shivani Nagaram : లిటిల్ హార్ట్స్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది శివానీ నగరం. ఆమెకు ఈ సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది. దీనికంటే ముందు ఆమె సుహాస్ హీరోగా వచ్చిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాతో హిట్ అందుకుంది. వరుసగా రెండు హిట్లు పడటంతో ఆమెకు వరుస సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే సాధారణంగా హీరోయిన్లకు హీరోలపై క్రష్ ఉండటం కామనే కదా. మరి ఈ యూత్ ఫుల్ బ్యూటీకి కూడా ఓ స్టార్ హీరో అంటే మంచి క్రష్ ఉందంట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తనకు సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే పిచ్చి అని తెలిపింది.
Read Also : JR NTR : ఎన్టీఆర్ పై ఆ బ్యాడ్ సెంటిమెంట్ తొలగిపోయినట్టే..
మహేశ్ బాబును చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆయన చాలా అందంగా ఉంటాడు. ఆయనే నాకు చిన్నప్పటి నుంచి ఫేవరెట్ హీరో. ఒక్కసారి అయినా ఆయన్ను కలవాలని అనుకునేదాన్ని. ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాక ఛాన్స్ వస్తే ఆయన సినిమాలో ఏం చేయడానికైనా నేను రెడీగా ఉన్నాను. ఆయన సినిమాలో నటించే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా అంటూ తెలిపింది ఈ బ్యూటీ. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. శివానీకి ఇప్పుడు వరుసగా సినిమా ఛాన్సులు వస్తుండటంతో చాలా బిజీగా మారిపోయింది.
Read Also : JR NTR : ఎన్టీఆర్ పై ఆ బ్యాడ్ సెంటిమెంట్ తొలగిపోయినట్టే..
