Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivaji: టాలీవుడ్ సీనియర్ యాక్టర్, బిగ్‌బాస్ ఫేమ్ శివాజీ తాజాగా ‘తెల్ల కాగితం’ చిత్ర ట్రైలర్ లాంచ్ వేదికపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. యంగ్ హీరో హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన ‘తెల్ల కాగితం’ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన శివాజీ.. తన కెరీర్, ఇండస్ట్రీ సమీకరణాలపై ఓపెన్‌గా మాట్లాడారు. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ‘పుష్ప’ చిత్రంలోని కీలక పాత్ర గురించి సంచలన విషయాన్ని బయటపెట్టారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఏ పాత్ర రాసిపెట్టి ఉంటే వాళ్లకే దక్కుతుందని చెబుతూ ‘పుష్ప’ ప్రస్తావన తెచ్చారు శివాజీ. “మనం ఎంత అనుకున్నా విధి నిర్ణయం మరొకటి ఉంటుంది. నిజం మాట్లాడాలంటే సుకుమార్ గారి ‘పుష్ప’లో ‘మంగళం శ్రీను’ పాత్రను ఫస్ట్ నేనే చేయాల్సింది. కానీ అది సునీల్ ఖాతాలోకి వెళ్లాలని రాసిపెట్టి ఉంది, కాబట్టే అతడికి వెళ్లింది. ఆ క్యారెక్టర్‌ను సునీల్ అద్భుతంగా పండించి విజయం సాధించాడు” అంటూ మంగళం శ్రీను పాత్ర వెనుక ఉన్న అసలు నిజాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా ‘తెల్ల కాగితం’ సినిమాతో తనకున్న అనుబంధాన్ని శివాజీ గుర్తుచేసుకున్నారు. రీ-ఎంట్రీలో సినిమాలు చేయాలనుకున్న సమయంలో మొదట తన వద్దకు వచ్చిన ప్రాజెక్టుల్లో ఇదొకటని వెల్లడించారు. ఈటీవీ సాయికృష్ణ ద్వారా రాజమండ్రి నేపథ్యంలో సాగే ఈ స్వచ్ఛమైన ప్రేమకథ తన వద్దకు వచ్చిందని, వినగానే కథ విపరీతంగా నచ్చడంతో తానే స్వయంగా నిర్మించాలని కూడా భావించినట్లు చెప్పారు. అయితే పలువురు నిర్మాతలు, దిల్‌రాజు చేతుల మీదుగా చివరకు ఈ ప్రాజెక్ట్ కృష్ణ నిర్మాణంలో లాక్ అయిందని వివరించారు. కథపై ఉన్న నమ్మకంతోనే ఈ వేదికపైకి వచ్చానని, చిన్న టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. హీరో హర్ష్ రోషన్‌కు ఈ సినిమా కెరీర్లో మంచి మైలురాయిగా నిలవాలని, హీరోయిన్ నక్షత్రతో పాటు టీమ్ మొత్తానికి భారీ విజయం దక్కాలని ఆకాంక్షించారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బులగాని స్వరాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ప్రశంసించారు.
Also Read
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
- అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ 'AK47' ఔట్? అసలు కారణం ఇదే..
- Randeep Hooda: ‘‘అహింసతో మాత్రమే స్వాతంత్య్రం రాలేదు’’.. సావర్కర్‌పై బాలీవుడ్ స్టార్ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!