ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో పోరాడుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘మగధీర’, ‘బాహుబలి’ లాంటి చిత్రాలకు క్లాసిక్ సాంగ్స్ ని ఇచ్చిన శివ శంకర్ మాస్టర్ ఎప్పుడు సెట్ లో యాక్టివ్ గా కనిపించేవారట.. ప్రస్తుతం ఆయన చివరి కోరిక.. తీరలేదని టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన చివరికోరిక వింటే ఆయన తన వృత్తిని ఎంతలా ప్రేమిస్తారో అర్ధమవుతుంది.
శివ శంకర్ మాస్టర్ కి వృత్తి అంటే ఊపిరితో సమానమని, ఆయన చివరి శ్వాస వరకు పనిచేస్తూనే ఉండాలని కోరుకొనేవారట.. చివరికి తన మరణం కూడా తాను డాన్స్ చేస్తూ ఉన్నప్పుడే రావాలని కోరుకున్నారట.. సినిమా సెట్‌లోనే తను కన్నుమూయాలనేది చివరి కోరికగా చెప్పేవారట.. కానీ ఆయన కోరిక మాత్రం దేవుడు తీర్చలేకపోయాడు. కరోనా బారిన పడిన ఆయన వారం రోజులు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. శివ శంకర్ మాస్టర్ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని చిత్ర పరిశ్రమ కన్నీటిపర్యంతమవుతుంది
