Site icon NTV Telugu

Shiva Re-Release: శివ మళ్లీ వస్తున్నాడు.. రీ-రిలీజ్‌పై బన్నీ స్పెషల్ మెసేజ్

Shiva Allu Arjun

Shiva Allu Arjun

తెలుగు సినిమా చరిత్రలో సునామీలా మార్పులు తెచ్చిన కల్ట్ క్లాసిక్ ‘శివ’ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించి, అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఈ ఐకానిక్ చిత్రం 36 ఏళ్ల క్రితం విడుదలై తెలుగు సినీ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు అదే లెజెండరీ సినిమా నవంబర్ 14న గ్రాండ్‌గా రీ-రిలీజ్ కానుంది.

Also Read : Mass Jathara : మాస్ జాతర ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ – రవితేజ మాస్ ఎంట్రీకి రెడీ!

‘శివ’ విడుదలైన రోజుల్లోని ఆ మాస్ క్రేజ్‌, యూత్ రెస్పాన్స్ ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్‌లు, రియలిస్టిక్ టేకింగ్‌, ఇలయరాజా సంగీతం, నాగార్జున స్టైల్ ఇవన్నీ కలిసి ఆ సినిమాను కొత్త దిశగా తీసుకెళ్లాయి. అందుకే ఈ సినిమా రీ-రిలీజ్‌కి ముందు నుంచే టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇక ఈ సందర్భంగా ప్రముఖులు, దర్శకులు ‘శివ’ తమ జీవితంపై చూపిన ప్రభావం గురించి పంచుకుంటున్నారు. ఇప్పటికే శేఖర్ కమ్ముల, అశుతోష్ గోవారికర్ తమ అనుభవాలను వీడియోల రూపంలో పంచుకోగా, తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్పెషల్ మెసేజ్ ఇచ్చారు.

ఆ వీడియోలో బన్నీ మాట్లాడుతూ.. “తెలుగు సినిమా చరిత్రలో ‘శివ’ ఒక ఐకానిక్ చిత్రం. ఆ ఒక్క సినిమా భారతీయ సినీ పరిశ్రమకు కొత్త దారులు చూపింది. మాస్‌, రియలిజం, టెక్నికల్ బ్రిలియన్స్ అన్నీ కలిపిన ఒక అద్భుతం అది. అలాంటి సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తుంటే ఆ వేడుకను గ్రాండ్‌గా జరుపుకోవాలి. అక్కినేని అభిమానులకే కాకుండా ప్రతి తెలుగు సినిమా ప్రియుడికి ఇది సెలబ్రేషన్‌ లాంటిది. ఈసారి థియేటర్‌కి వెళ్లేటప్పుడు రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండి!” అని తనదైన మాస్‌ స్టైల్‌లో సందేశం ఇచ్చాడు. బన్నీ ఇచ్చిన ఈ ఫన్నీ, ఫ్యాన్‌ఫుల్ మెసేజ్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అంతే కాదు బన్నీ వీడియో పై ఇటు నాగార్జున తో పాటు నాగచైతన్య కూడా స్పందించారు. మొత్తనికి నాగార్జున – వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మాస్టర్‌పీస్‌ రీ-రిలీజ్‌ కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 36 ఏళ్ల క్రితం తెరపై మళ్లీ శివ గర్జించబోతున్నాడు.

 

Exit mobile version