Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్‌తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ

Dhanush Shiva Nirvana

Dhanush Shiva Nirvana

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఎక్కడా ఆగకుండా దూసుకుపోతున్న ‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ శివ నిర్వాణ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ టాలీవుడ్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, తన తదుపరి సినిమాపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టడంతో పాటు, ‘ఇరుముడి’లో క్రియేట్ చేసిన భయంకరమైన ఫారెస్ట్ సెటప్ వెనుక ఉన్న అసలు సీక్రెట్‌ను రివీల్ చేశారు. ‘ఇరుముడి’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో శివ నిర్వాణ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ స్టార్ హీరో ధనుష్‌తో శివ నిర్వాణ తదుపరి సినిమా ఉండబోతోందని, ఈ విషయాన్ని స్వయంగా హీరో సూర్య కూడా ఒకచోట ప్రస్తావించారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ సెన్సేషనల్ టాక్‌పై జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు శివ నిర్వాణ స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు. “అందులో ఎలాంటి నిజం లేదు. నేను ఇంకా నా తదుపరి సినిమాకు సంబంధించి రైటింగ్ కూడా స్టార్ట్ చేయలేదు” అని ఆయన కుండబద్దలు కొట్టారు. తదుపరి సినిమా కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లోనే ఉంటుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. నిర్మాతలు నవీన్, రవిశంకర్ గారితో తనకు ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉందని, ఆ బ్యానర్ ఎప్పుడూ వెల్కమ్ చెబుతుందని స్పష్టం చేశారు. వారి నిర్మాణంలో ఎప్పుడైనా సినిమాలు జరుగుతూనే ఉంటాయని తెలిపారు.