ఆర్ఆర్ఆర్ కోసం ప్రపంచ సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్నారన్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే దర్శక ధీరుడు రాజమౌళి ప్రమోషన్స్ ని వేగవంతం చేశాడు. ప్రమోషన్స్ లో భాగంగా నేడు చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ వేడుకకు తమిళ్ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్యఅథిధులుగా విచ్చేశారు. ఈ వేడుకలో శివ కార్తికేయన్, ఎన్టీఆర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం శివ కార్తికేయన్ డాన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఇటీవల ఒక సాంగ్ రిలీజ్ అయ్యింది. ఆ సాంగ్ ని యాంకర్ ఎన్టీఆర్, చరణ్ ద్వారా తమిళ్ లో అనిపించారు. ఇక ఈ సాంగ్ డాన్ సినిమాలోదని, శివ కార్తికేయన్ హీరో అని చెప్పడంతో చరణ్ , తారక్, శివకార్తికేయన్ కి విషెస్ చెప్పారు. శివ కార్తికేయన్ మైక్ తీసుకొని ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదని, మధ్యలో నా సినిమా ప్రమోషన్స్ చేసుకోవడం లేదని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆ సాంగ్ లో ఉన్న లిరిక్స్ తారక్ కి సరిగ్గా సరిపోతాయని.. ఎన్టీఆర్ అంటే ఒక డాన్ .. ఆయన థంగ్ లైఫ్ కు ఆయనే నిదర్శనం అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.