Shiva Kandukuri: ఇలాంటి ఎలిమెంట్ ఏ డిటెక్టివ్ సినిమాలో లేదు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiva Kandukuri Interview about Bhoothaddam Bhaskar Narayana: శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. మార్చి 1న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో శివ కందుకూరి మీడియాతో భూతద్ధం భాస్కర్ నారాయణ విశేషాలు పంచుకున్నారు.
మీకు ఇది తొలి డిటెక్టివ్ సినిమా కదా..ఈ అనుభవం గురించి చెప్పండి ?
క్రైమ్ అండ్ డిటెక్టివ్ థ్రిల్లర్ సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి. డిటెక్టివ్ అనేసరికి చంటబ్బాయ్, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఇలాంటి జోనర్ సినిమా చేయాలనుకున్నపుడు ఏదో యునిక్ నెస్ ఉంటే తప్పితే చేయకూడదు అనుకున్నా, ఇలాంటి సమయంలో భూతద్ధం భాస్కర్ నారాయణ కథ విన్నాను. ఇందులో ఒక మైథాలజీ ఎలిమెంట్ వుంది. మునుపెన్నడూ ఇలాంటి ఎలిమెంట్ ఏ డిటెక్టివ్ సినిమాలో లేదు. అది నాకు కొత్తగా ఆసక్తికరంగా అనిపించింది. దిష్టి బొమ్మ మనం చూస్తుంటాం. కానీ అసలు అది ఎందుకు వుందనేది పెద్దగా పట్టించుకోము. దాని గురించి చాలా మందికి తెలీదు. దిని గురించి పురాణాల్లో ఒక కథ వుంది. దానిని ఈ కథకు చాలా అద్భుతంగా జోడించాడు దర్శకుడు. దీంతో చాలా కొత్తదనం వుంటుంది. అలాగే ఇందులో డిటెక్టివ్ పాత్ర కూడా చాలా భిన్నంగా డిజైన్ చేశారు. కథ విన్నప్పుడు ఎంత ఎక్సైటింగ్ అనిపించిందో సినిమా చూసినప్పుడు అది మరింత పెరిగింది. అవుట్ పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. ఖచ్చితంగా ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామనే నమ్మకం వుంది.
Also Read
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
- Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు 'వారణాసి' నుంచి క్రేజీ అప్డేట్!
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
డిటెక్టివ్ అంటే బ్లాక్ ఎండ్ బ్లాక్ చూపిస్తుంటారు.. ఇందులో మాత్రం పంచెకట్టు, లుంగీలో కనిపిస్తున్నారు ?
దర్శకుడు పురుషోత్తం రాజ్ ది అనంతపురం దగ్గర ఓ విలేజ్. ఇందులో వున్న పాత్రలని ఆయన పల్లె జీవనంలో చూసిన పాత్రల్లా డిజైన్ చేశారు. ఈ కథ కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల మధ్య వుండే ఫారెస్ట్ టౌన్ నేపథ్యంలో జరుగుతుంది. ఇందులో డిటెక్టివ్ పాత్ర కూడా అక్కడ వున్న ఓ సహజసిద్దమైన పాత్రలా డిజైన్ చేశారు. దీంతో వరల్డ్ బిల్డింగ్ లో ఒక ఫ్రెష్ నెస్ వచ్చింది.
ఈ సినిమా విడుదల కాస్త ఆలస్యం జరగడానికి కారణం ?
వీఎఫ్ఎక్స్ వర్క్ ఉండే సినిమా ఇది, మేము మొదట ఎంచుకున్న వీఎఫ్ఎక్స్ టీం ఇచ్చిన అవుట్ పుట్ మాకు తృప్తిని ఇవ్వలేదు. దీంతో నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా మరో కంపెనీతో మొదటి నుంచి చేయించారు. దీంతో సీజీ వర్క్ అద్భుతంగా వచ్చింది, ఈ కథ, సినిమాపై ఉన్న నమ్మకం మరింత పెరిగింది. ప్రస్తుతం మైథాలజీకల్ థ్రిల్లర్ జోనర్ ని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలో సినిమా రావడం మంచి పరిణామం అనిపిస్తుంది. బిజినెస్ పరంగా కూడా నిర్మాతలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక నటుడిగా ఇది నాకు ఆనందాన్ని ఇచ్చింది. గీతా ఆర్ట్స్ ఈ సినిమాను విడుదల చేస్తుండటం మాకు మరింత బలాన్ని ఇచ్చింది.
భూతద్ధం భాస్కర్ నారాయణ టైటిల్ పెట్టడానికి కారణం ?
ఇందులో నా పేరు భాస్కర్ నారాయణ. ఆ పాత్రకు భూతద్ధం సైజు కళ్లద్దాలు వుంటాయి. దీంతో అందరూ భూతద్ధం భాస్కర్ నారాయణ అని పిలుస్తుంటారు. డిటెక్టివ్ అనేసరికి భూతద్ధంని వాడుతుంటాం. టైటిల్ కి పాత్రకు రెండికి ఆ టైటిల్ యాప్ట్ గా సరిపోయింది. ఇందులో ఫన్ ఎలిమెంట్ కూడా వుంది. అయితే కథలో భాగమయ్యే ఉంటుంది. అలాగే ఇందులో లవ్ ట్రాక్ కూడా కథలో లీనమయ్యే ఉంటుంది.
కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
ప్రమోద్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాను. ఓల్డ్ సిటీ నేపథ్యంలో జరిగే కథ అది. వినోదంతో పాటు మంచి భావోద్వేగాలు కూడా వుంటాయి. మార్చి 4 నుంచి షూట్ కి వెళ్తున్నాం. ఇది కాకుండా మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి.
తాజావార్తలు
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!