NTV Telugu Site icon

The Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ ఒక చెత్త సినిమా.. దీనివలనే జమ్మూకశ్మీర్ లో హత్యలు ఎక్కువ అయ్యాయి

Sanjay

Sanjay

The Kashmir Files: గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలీవుడ్ సినిమా ది కశ్మీర్ ఫైల్స్ కు ఘోర అవమానం జరిగింది. అంతర్జాతీయ వేదికపై గౌరవంగా పిలిచి ఘోరంగా అవమానించారు. ఇఫి జ్యూరీ చీఫ్ నదావ్ లాపిడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. కశ్మీర్‌ ఫైల్స్‌ అసలు ఇలాంటి ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించాల్సిన సినిమా కాదని, ఈ సినిమా దుష్ప్రచారం చేస్తుందని చెప్పుకొచ్చాడు. కశ్మీర్ ఫైల్స్ ఒక చెత్త సినిమా అని తిట్టిపోశారు. దీంతో ఈ చిత్రబృందం వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపోతే ఈ వివాదాంలోకి రాజకీయ పార్టీలు ప్రవేశించాయి. తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్, నదావ్ లాపిడ్ కు మద్దతు పలికారు. ఆయన అన్నదాంట్లో తప్పులేదని, ఈ సినిమా వలన దుష్ప్రచారం ఎక్కువ జరిగిందని చెప్పుకొచ్చారు.

“ఈ సినిమాలో ఒక వర్గం వారినే తప్పుగా చూపించారు. ఈ సినిమాను పబ్లిసిటీ చేయడంలో ఒక పార్టీ తలమునకలు కూడా అయ్యింది. కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఇప్పుడు పబ్లిసిటీ చేస్తున్నవారు అప్పుడు ఏమయ్యారు. అప్పుడు వారి పిల్లలు శరణు కోరినప్పుడు ఈ ప్రభుత్వం అంతా ఎక్కడుంది. కశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదల అయ్యాకే అక్కడ హత్యలు ఇంకా పెరిగాయి. దీనిమీద కశ్మీర్ ఫైల్స్ 2.o తీస్తారా..? తీసుకోండి”అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.