వయసు పెరిగేకొద్దీ అందం, ఫిట్‌నెస్ కాపాడుకోవడం చాలామందికి సవాలుగా మారుతుంది. కానీ కొన్ని తారలు మాత్రం వయసుతో పాటు మరింత కాంతివంతంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంటారు. ఈ జాబితాలో ఎప్పుడూ ముందుండే పేరు బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి. ఇప్పటికే 50 ఏళ్లు దాటినా, ఆమె చెక్కిన శిల్పంలా ఉన్న శరీరాకృతి, గ్లోయింగ్ స్కిన్ చూసి ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. తన ఫిట్‌నెస్ రహస్యాలను సోషల్ మీడియాలో పంచుకోవడం ఆమెకు అలవాటే. ఇటీవల ఒక సందర్భంలో శిల్పా తన రోజువారీ ఆరోగ్య అలవాట్లు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
Also Read : Sreeleela : ఎన్టీఆర్ వల్లే శ్రీలీల కూచిపూడి నేర్చుకుంది..
శిల్పా మాట్లాడుతూ.. ‘నేను నిద్రలేచిన వెంటనే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగుతాను. ఇది జీర్ణక్రియకు ఎంతో సహాయపడుతుందని చెబుతుంది. కాసేపటికి నాలుగు చుక్కల నోనీ జ్యూస్.. ఇది రోజంతా కావాల్సిన శక్తిని ఇస్తుంది. మూడవది టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేస్తుంది. ఇది నోటి ఆరోగ్యానికి మంచిదని చెబుతోంది. ఒక బ్రేక్‌ఫాస్ట్ విషయానికి వస్తే.. బరువు తగ్గాలనే ఆలోచనతో చాలామంది బ్రేక్‌ఫాస్ట్ మానేస్తారు. కానీ నేను మాత్రం అలాంటి పొరపాటు ఎప్పుడు చేయను. ఉదయం తీసుకునే ఫస్ట్ మీల్ చాలా ముఖ్యం. ఇది శరీరానికి ఎనర్జీ ఇస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో..సీజనల్ ఫ్రూట్స్, బాదం పాలలో ఫ్రూట్స్ ముక్కలు, మ్యూజ్లీ,ఉడికించిన గుడ్లు తప్పనిసరి. ఇక చాలామంది బరువు పెరుగుతామనే భయంతో నెయ్యి తినరు. కానీ నేను మాత్రం మధ్యాహ్న భోజనంలో నెయ్యి తప్పనిసరి. డైటింగ్ చేయడం, కడుపు మాడ్చుకోవడం నాకిష్టం లేదు. సమయానికి తినడం, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం ముఖ్యం. వంటి తీరు ఒక్కోక్కరిది ఒక్కోలా ఉంటుంది. నేను పాటించే ఆహార అలవాట్లు అందరికీ సరిగ్గా సరిపోవచ్చు, లేకపోవచ్చు. కాబట్టి ఎప్పుడూ వైద్యుల సలహాతోనే మీ డైట్, ఫిట్‌నెస్ రూటీన్‌ను మార్చుకోండి’ అని తెలిపింది.