Shashivadane : ‘ప్రేమించాలని డిసైడ్ అయితే ఎన్నొచ్చినా యుద్ధం చేయాల్సిందే’.. ఆకట్టుకుంటోన్న ‘శశివదనే’ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్, శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ తదితరులు నటించగా, గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే..
Also Read
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
‘గల గల పారే గోదారి గట్టుతో కళ కళలాడే అందమైన పల్లెటూరు ఒక అమ్మాయిని చూడగానే తొలి చూపులోనే అబ్బాయికి ప్రేమ పడుతుంది. ప్రేమ ఆ చూపుతో మొదలైంది.. కాలం బొమ్మలా ఆగిపోయింది. ఆమెతో పాటే నా మనసు కూడా మాయమైంది’ అనే డైలాగ్ హీరోయిన్‌పై హీరోకి లవ్ డెప్త్ ఏంటో చెబుతోంది. ‘లంకలోని సీత కోసం రాముడు సముద్రాలు దాటినట్లు.. నీ సైకిల్ పాప కోసం నువ్వు ఈ గోదారి దాటుతున్నావన్నమాట’ ఈ డైలాగ్ చూస్తే తన మనసుకి నచ్చిన ప్రేయసి కోసం హీరో గోదారి దాటి వెళ్లి అన్వేషిస్తాడని. దానికి తగినట్లుగానే సన్నివేశాలను చూపించారు. చివరకు హీరోయిన్ కనపడగానే హీరో పడే భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.
‘ఆడపిల్లలు మన జీవితంలోకి కోరికలతోను, ఆశలతోను రారురా..జీవితంలో తోడుగా ఉంటామని భరోసాతో వస్తారు.. మనతో చేయ్యట్టుకుని ఏడడుగులు నడుస్తారు’ ‘నాకు ఊహ తెలియని వయసు నుంచి నా అనుకున్న బంధం నాన్న.. ఉహ తెలిసిన తర్వాత నా అనుకున్న బంధం మీరు’ అంటూ హీరోయిన్‌కి హీరో తన ప్రేమను చెబితే, ‘ఇంత ప్రేమ నా నుంచి ఎప్పటికీ దూరం కాదుగా రాఘవ’ అంటూ హీరోయిన్ ప్రేమగా హీరోని రిక్వెస్ట్ చేసే సన్నివేశం ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గాఢతను తెలియజేస్తోంది. ‘ప్రేమించాలని డిసైడ్ అయితే ఎన్నొచ్చినా యుద్ధం చేయాల్సిందే’ అని హీరోకి తండ్రి చెప్పటం చూస్తే ప్రేమలో హీరోకి ఎదురైన సమస్య గురించి తెలుస్తుంది.
అక్కడి నుంచి మనకు విలన్ పాత్ర ఎలా ఉండబోతుంది.. తన వల్ల హీరో పడ్డ ఇబ్బందులను ట్రైలర్‌లో చూపించే ప్రయత్నం చేశారు. ‘జాగ్రత్తగా వెళ్లి.. జాగ్రత్తగా తిరిగి రా’ అంటూ హీరోకి హీరోయిన్ జాగ్రత్త చెప్పటం, ‘ప్రేమతో వెళ్తున్నా.. వచ్చాక ప్రపంచాన్నే గెలుద్దాం’ అని హీరో చెప్పటం.. దానికి హీరో నుంచి హీరోయిన్ ప్రామిస్ తీసుకోవటంతో ట్రైలర్ ముగిసింది. గోదావరి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలోని సన్నివేశాలు ట్రైలర్‌లోనే హృదయాలను హత్తుకుంటుంటే సినిమాలో ఎమోషన్స్ ఎలా ఉండబోతున్నాయనే క్యూరియాసిటీ అయితే కలుగుతోంది. శరవణ వాసుదేవన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ నేపధ్య సంగీతాన్ని అందిస్తున్నారు. సాయికుమార్ దారా అందించిన విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. గ్యారీ బి.హెచ్. ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!