Sharwanand: ఇద్దరు సూపర్ స్టార్లకి శర్వానే విలన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన పని అయిపొయింది అనే కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికీ హిట్ సౌండ్ రీసౌండ్ వచ్చేలా వినిపించాడు రజినీ. 500 కోట్లు రాబట్టిన జైలర్ సినిమా కోలీవుడ్ కి ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి రెడీగా ఉంది. దాదాపు దశాబ్దం తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన రజినీకాంత్, ఈసారి ఎక్స్పరిమెంట్ చేయడానికి సిద్ధమయ్యాడు. తన నెక్స్ట్ సినిమాని జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ తో చేయబోతున్నాడు రజినీ. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటూ ఉంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తుండడం విశేషం. ఇండియన్ సూపర్ స్టార్స్ అయిన అమితాబ్-రజినీకాంత్ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ మూవీ రేంజ్ ఎలా ఉండబోతుందో ఊహించొచ్చు. అయితే జ్ఞానవేల్ కాబట్టి రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమా కాకుండా కొత్త కథా కథనాలతో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్ట్ లో రజినీకాంత్ స్క్రీన్ టైమ్ పైన కూడా కోలీవుడ్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. రజినీకాంత్ ఎక్కువ డేట్స్ ఇవ్వలేదు, ఎక్కువ సేపు సినిమాలో కనిపించడు, సెకండ్ హాఫ్ లో మాత్రమే ఉంటాడు… ఇలా అనేక మాటలు వినిపిస్తున్నాయి. వీటిలో ఎంతవరకూ నిజముంది అనే విషయం తెలియదు కానీ టీజే జ్ఞానవేల్ ఒక మంచి సినిమాని ఇవ్వగలడు అనే విషయం మాత్రం గ్యారెంటీగా చెప్పగలం. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, శర్వానంద్ ఇందులో ఒక కీ రోల్ ప్లే చేయడానికి ఓకే చెప్పాడట. గతంలో ఈ రోల్ నాని దగ్గరకి వెళ్లింది కానీ నాని నో చెప్పాడని టాక్. శర్వా నటిస్తున్న రోల్ కూడా నెగటివ్ క్యారెక్టర్ అని, అమితాబ్-రజినీకాంత్ లకి విలన్ గా శర్వా నటిస్తున్నాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇంటెన్స్ యాక్టింగ్ చేయడంలో శర్వానంద్ దిట్ట, డైలాగ్ డెలివరీలో కూడా ఆ ఇంపాక్ట్ కనిపిస్తది. అలాంటి శర్వానంద్… అమితాబ్-రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్స్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలో విలన్ గా నటించే అవకాశం సొంతం చేసుకోవడం అంటే మాటలు కాదు.
Also Read
- Jason Sanjay: "ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే" డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
- TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
- AAA Cinemas : AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్. బన్నీ ఎమోషనల్ ట్వీట్..
- Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్‌బై!
తాజావార్తలు
-
Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్‌కు శుభవార్త.. సాయి సుదర్శన్‌కు బ్యాడ్ న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం..
-
Jason Sanjay: “ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే” డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!